News October 25, 2024

అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు AP హైకోర్టులో భారీ ఊరట లభించింది. బన్నీపై నంద్యాల పోలీసులు పెట్టిన కేసుకు సంబంధించి వచ్చే నెల 6న ఉత్తర్వులిస్తామని, అప్పటివరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. కాగా గత ఎన్నికల సమయంలో నంద్యాలలో వైసీపీ నేత రవిచంద్ర కిశోర్ రెడ్డి తరఫున అల్లు అర్జున్ ప్రచారం చేశారు. నిబంధనలు ఉల్లంఘించారని బన్నీపై పోలీసులు కేసు నమోదు చేయగా, ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు.

Similar News

News October 28, 2025

పొట్టి కప్ అయినా పట్టేస్తారా?

image

ఆసీస్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ రేపటి నుంచి 5 మ్యాచుల T20 సమరానికి సిద్ధమైంది. బుమ్రా జట్టులోకి రానుండటం ప్లస్ కానుంది. అతడి సారథ్యంలో పేస్ దళం AUSను ఎలా కట్టడి చేస్తుందో చూడాలి. అటు యంగ్ ఇండియా బ్యాటర్లు ఏ మేరకు రాణిస్తారనేది ఆసక్తిగా మారింది.
స్క్వాడ్: సూర్య, అభిషేక్, గిల్, తిలక్, నితీశ్, దూబే, అక్షర్, జితేశ్, వరుణ్, బుమ్రా, అర్ష్‌దీప్, కుల్దీప్, హర్షిత్, సంజూ, రింకూ, సుందర్

News October 28, 2025

మూడోసారీ అధ్యక్షుడు కావాలనుంది: ట్రంప్

image

రెండోసారి US అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మూడోసారీ పోటీ చేయాలని ఉందన్నారు. మలేషియా నుంచి టోక్యోకు వెళ్తుండగా ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ విషయం బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్‌గా నిలబడతారన్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. మూడోసారి అధ్యక్షుడిగా పోటీ చేసే మార్గాలున్నాయని, ఇంకా ఆ దిశగా ఆలోచించలేదన్నారు. అయితే US చట్టం ప్రకారం మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయలేరు.

News October 28, 2025

ముప్పై తర్వాత మహిళలు ఇలా చేయండి

image

సాధారణంగా వర్కింగ్ ఉమెన్‌కు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అటు ఇంటిని-ఇటు ఉద్యోగాన్నీ బ్యాలెన్స్‌ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా 30ఏళ్లు దాటిన తర్వాత దీనికి తగ్గట్లు జీవనశైలిని మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడంతో పాటు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలని చెబుతున్నారు.