News March 22, 2024

BREAKING: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్

image

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ఈనెల 28 వరకు కస్టడీ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పిచ్చింది. దీంతో ఈడీ ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. ఈడీ నిన్న కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఇదే కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు.

Similar News

News April 21, 2025

IPL: ఇవాళ కీలక పోరు

image

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇవాళ GT, KKR మధ్య మ్యాచ్ జరగనుంది. 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఏడింట్లో 3 గెలిచి ఏడో స్థానంలో ఉన్న కోల్‌కతా ప్లేఆఫ్స్ వెళ్లాలంటే ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 4 సార్లు తలపడగా GT 2, KKR ఒక మ్యాచ్‌లో గెలుపొందాయి. ఒకటి రద్దైంది. ఇవాళ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News April 21, 2025

ఒకేసారి APPSC, DSC పరీక్షలు.. అభ్యర్థుల్లో ఆందోళన

image

AP: మెగా డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జులై 6 వరకు జరగనుండగా అదే సమయంలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. దీంతో రెండింటికీ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జూన్ 16 నుంచి 26 వరకు పాలిటెక్నిక్, జూ.లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల భర్తీకి పరీక్షలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆయా తేదీల్లో మార్పు చేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.

News April 21, 2025

IPL కోసం మటన్, పిజ్జాకు వైభవ్ దూరం: కోచ్

image

RR యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి మటన్, పిజ్జా అంటే చాలా ఇష్టమని కోచ్ మనీశ్ వెల్లడించారు. గతంలో ఎంత పెట్టినా మిగిల్చేవాడు కాదని, అందుకే బొద్దుగా ఉన్నాడని తెలిపారు. IPLలో బరిలో దిగడం కోసం వాటికి దూరంగా ఉండిపోయాడన్నారు. అతనికి బ్రియాన్ లారా అంటే ఇష్టమని చెప్పారు. లారాతోపాటు యువరాజ్ మిక్సింగ్‌లా సూర్యవంశీ కనిపిస్తాడని పేర్కొన్నారు. అతను తప్పకుండా ఎక్కువకాలం క్రికెట్ ఆడతాడని ధీమా వ్యక్తం చేశారు.

error: Content is protected !!