News March 13, 2025

BREAKING: పోసానికి బిగ్ షాక్

image

AP: నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఐడీ నమోదు చేసిన కేసులో ఆయనకు గుంటూరు కోర్టు ఈ నెల 26 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోసానిని గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. నిన్నటివరకు నాలుగు కేసుల్లో బెయిల్ వచ్చిన పోసాని త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని అంతా భావించగా, ఊహించని విధంగా మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

Similar News

News March 13, 2025

నాని సవాల్‌.. డైరెక్టర్ రియాక్షన్ ఇదే

image

తాను నిర్మాతగా తెరకెక్కించిన ‘కోర్టు’ సినిమా నచ్చకపోతే ‘హిట్-3’ చూడొద్దని హీరో నాని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘కోర్టు’ మూవీని సినీ ప్రముఖులు, మీడియాకు ప్రీమియర్ షో ప్రదర్శించారు. మూవీ చూసిన దర్శకుడు శైలేష్ కొలను తన సినిమా(హిట్-3) సేఫ్ అని ట్వీట్ చేశారు. కోర్టు మూవీ అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.

News March 13, 2025

ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు

image

TG: ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఈ అథారిటీ ఛైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. దీని పరిధిలో 56 రెవెన్యూ గ్రామాలు, 7 మండలాలు రానున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌‌కు ధీటుగా దీనిని ప్రభుత్వం ఫోర్త్ సిటీగా అభివర్ణిస్తోంది.

News March 13, 2025

నితీశ్ రాజీనామా చేసి ఆశ్రమానికి వెళ్లు: తేజస్వీ యాదవ్

image

బిహార్ సీఎం నితీశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. నితీశ్ రాష్ట్రాన్ని పాలించేందుకు ఫిట్‌గా లేరని దుయ్యబట్టారు. ఆయన ప్రవర్తన సరిగా లేదని, మహిళలను అవమానపరుస్తున్నారని తేజస్వీ ఆరోపించారు. నితీశ్ స్పృహ లేకుండా పాలన చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెంటనే పదవికి రాజీనామా చేసి ఆశ్రమానికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

error: Content is protected !!