News December 1, 2024
BREAKING: భారత్ ఘన విజయం

ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ XI జట్టుతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు 43.2 ఓవర్లలో 240 రన్స్ చేసింది. ఛేదనలో భారత ఓపెనర్ జైస్వాల్ (45), గిల్(50), నితీశ్ రెడ్డి(42), జడేజా(27) రాణించడంతో 42.5 ఓవర్లలోనే 244/4 రన్స్ చేసి 6 వికెట్ల తేడాతో గెలిచింది. రోహిత్(3) నిరాశపర్చారు. ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో గెలిచినా ఇంకా ఆట కొనసాగిస్తున్నారు.
Similar News
News December 4, 2025
ఫిబ్రవరిలో పెళ్లి అని ప్రచారం.. స్పందించిన రష్మిక

నటి రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు కొంతకాలంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. 2026 ఫిబ్రవరిలో రాజస్థాన్లో పెళ్లి జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘వివాహాన్ని నేను ధ్రువీకరించను. అలాగని ఖండించను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. అంతకుమించి ఏమీ చెప్పను’ అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు.
News December 4, 2025
APPLY NOW: BEMLలో ఉద్యోగాలు

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<
News December 4, 2025
‘హిల్ట్’ లీకేజ్.. ఇద్దరు ఉన్నతాధికారులపై అనుమానం!

TG: <<18457165>>హిల్ట్<<>> పాలసీ లీకేజీపై విజిలెన్స్ టీమ్ విచారణ వేగవంతం చేసింది. ఈ లీక్ వెనుక ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నారని అనుమానిస్తోంది. సీఎంఓలోని ఓ అధికారిని నిన్న రాత్రి టీమ్ విచారించినట్లు తెలుస్తోంది. అటు BRSతో పాటు ఓ కీలక బీజేపీ నేతకు కూడా సమాచారం లీక్ అయినట్లు టాక్. ఉన్నతాధికారుల ప్రమేయంపై క్లారిటీ రావాల్సి ఉంది. CM ఈ విషయమై సీరియస్గా ఉండటంతో క్లారిటీ వస్తే కారకులకు షోకాజ్ నోటీస్ ఇచ్చే అవకాశముంది.


