News March 22, 2024
BREAKING: బీజేపీ నాలుగో జాబితా విడుదల

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాలుగో జాబితాను విడుదల చేసింది. 15 మందితో నాలుగో లిస్టును రిలీజ్ చేయగా.. అందులో 14 తమిళనాడు, ఒకటి పుదుచ్చేరి స్థానాలున్నాయి. నటి రాధికాశరత్ కుమార్ విరుధునగర్ నుంచి పోటీ చేయనున్నారు.
Similar News
News April 8, 2026
పవన్‌లో కర్మయోగిని చూశా: డైరెక్టర్ బాబీ

AP Dy.CM పవన్‌ను డైరెక్టర్ బాబీ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి పనిచేసిన(సర్దార్ గబ్బర్ సింగ్) జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. ‘ఆస్తులు పెంచుకోవడమే రాజకీయం అనుకునే ఈ రోజుల్లో ప్రజా సేవ కోసం రాజభోగాలను, సుఖాలను వదులుకొని శ్రమిస్తున్న ఋషి పవన్ కళ్యాణ్. జ్ఞానం కోసం అడవికి వెళ్లిన బుద్ధుడిని చరిత్రలో చదివాం. జనం కోసం నిరంతరం తపించే కర్మయోగిని ఇవాళ కళ్లారా చూశా’ అని కొనియాడారు.
News April 8, 2026
హార్ముజ్‌పై టోల్స్ విధిస్తే ఒప్పుకోం: ఒమన్

హార్ముజ్ జలసంధిపై టోల్స్ విధించేందుకు అనుమతించాలన్న ఇరాన్ సీజ్‌ఫైర్ డిమాండ్‌ను పొరుగు దేశమైన ఒమన్ తప్పుపట్టింది. అది అంతర్జాతీయ జలమార్గమని దానిపై ఫీజు వసూలు చేయడం సరికాదని ఒమన్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ పేర్కొన్నారు. దీనిపై గతంలో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు తెలిపారు. కాగా అంతకుముందు హార్ముజ్‌పై టోల్స్‌కు ఇరాన్, ఒమన్ అంగీకరించాయని ఇరాన్ మీడియా పేర్కొంది.
News April 8, 2026
సీజ్‌ఫైర్ వేళ.. UAE, కువైట్‌పై ఇరాన్ దాడి

తమ దేశంలోని లవన్ రిఫైనరీపై దాడికి ప్రతీకారంగా UAE, కువైట్‌పై ఇరాన్ విరుచుకుపడింది. మిడిల్ ఈస్ట్‌లోని ఆ రెండు దేశాలపై మిస్సైల్స్ ప్రయోగించింది. ఒకవైపు సీజ్‌ఫైర్ అమల్లో ఉండగానే తమపై దాడి జరిగిందని ఇరాన్ చెప్తోంది. అందుకే అమెరికాకు మద్దతిస్తున్న గల్ఫ్ దేశాలపై దాడి చేసినట్లు తెలుస్తోంది.


