News August 26, 2024
BREAKING: కంగనా రనౌత్‌కు బీజేపీ షాక్

సొంత పార్టీ ఎంపీ కంగనా రనౌత్‌కు బీజేపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. పార్టీ పాలసీ విషయాలపై మాట్లాడే అధికారం, అనుమతి ఆమెకు లేదని అధిష్ఠానం స్పష్టం చేసింది. రైతుల ఉద్యమానికి సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. రైతుల ఉద్యమంలో విదేశాల కుట్ర ఉందని, వారిని అదుపు చేయకపోతే బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు వస్తాయని కంగన వ్యాఖ్యానించడం దుమారం రేపింది.
Similar News
News April 6, 2026
RBI వడ్డీ రేట్లు మారకపోవచ్చు: ఎకనమిస్టులు

వడ్డీ రేట్లలో RBI ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని, యథాతథంగా కొనసాగించవచ్చని ఎకనమిస్టులు అంచనా వేస్తున్నారు. రూపాయి పడిపోవడం, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో రేట్ల సవరణకు మొగ్గుచూపకపోవచ్చని అంటున్నారు. గత సమీక్షలోనూ రెపో రేటును 5.25 శాతం వద్దే <<19064412>>కొనసాగించడం<<>> తెలిసిందే. RBI MPC 3 రోజుల సమీక్ష ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. కమిటీ నిర్ణయాలను 8వ తేదీన RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా మీడియాకు వెల్లడించనున్నారు.
News April 6, 2026
DSP అవినీతి.. పనిమనిషికే బంగ్లా, థార్ కారు

బిహార్‌కు చెందిన DSP గౌతమ్ కుమార్ అవినీతి కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ఆయన ఇంట్లో పనిచేసే మహిళకు ₹కోటి బంగ్లా, థార్ కారు ఉన్నట్లు తేలడం ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను విస్మయానికి గురిచేసింది. ఆయన భార్య, గర్ల్‌ఫ్రెండ్ కూడా లగ్జరీ లైఫ్ గడుపుతున్నట్లు తాజా విచారణలో తేలింది. సోదాల్లో సుమారు ₹80 కోట్ల విలువైన ప్రాపర్టీలు బయటపడ్డాయి. ఆయన్ను సస్పెండ్ చేసి బ్యాంక్ అకౌంట్లపై దృష్టి పెట్టారు.
News April 6, 2026
GK: ముఖ్య పదవులు.. కనీస వయసు

*రాష్ట్రపతి- 35 ఏళ్లు
*ఉపరాష్ట్రపతి- 35
*గవర్నర్- 35
*ఎమ్మెల్సీ- 30
*రాజ్యసభ సభ్యుడు- 30
*ప్రధాని- 25
*లోక్‌సభ ఎంపీ- 25
*ఎమ్మెల్యే- 25
*సీఎం- 25
*సర్పంచ్- 21


