News March 9, 2025
BREAKING: టన్నెల్లో మృతదేహం

SLBC టన్నెల్‌లోని టీబీఎం మెషీన్ ముందు భాగంలో ఓ మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. వారికి కుడి చేయి, ఎడమ కాలు కనిపించింది. చేతికి ఉన్న కడియాన్ని బట్టి అతడు ఇంజినీర్ గుర్ప్రీత్ సింగ్‌గా అనుమానిస్తున్నారు. సాయంత్రంలోపు మృతదేహాన్ని బయటికి తీయనున్నారు. మరిన్ని మృతదేహాలు కూడా టీబీఎం మెషీన్‌లోనే చిక్కుకొని ఉండొచ్చని భావిస్తున్నారు.
Similar News
News December 4, 2025
పనిచేయని పోలీస్ వెబ్ సైట్లు.. ప్రజలకు ఇబ్బందులు

TG: సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్సైట్లు పనిచేయకపోవడంతో ఆన్లైన్ ఫిర్యాదుల విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్ తర్వాత కేటుగాళ్లు పోలీస్ సైట్లలో లింకులు ఓపెన్ చేస్తే బెట్టింగ్ సైట్లకు రీడైరెక్ట్ అయ్యేలా చేశారు. దీంతో ముందు జాగ్రత్తగా ఐటీ విభాగం సర్వర్లను తాత్కాలికంగా డౌన్ చేసింది. అంతకుముందు మంత్రుల వాట్సాప్ గ్రూపులు కూడా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే.
News December 4, 2025
ఫ్లాట్‌లో రాత్రంతా అమ్మాయిలు.. బ్యాచిలర్లకు ఫైన్

బెంగళూరులో బ్యాచిలర్లకు వింత అనుభవం ఎదురైంది. ఫ్లాట్‌లో రాత్రంతా అమ్మాయిలు ఉన్నారని రెసిడెన్షియల్ సొసైటీ ₹5వేల ఫైన్ విధించింది. వారికి బిల్లు కూడా ఇచ్చింది. ‘అతిథులు రాత్రిపూట ఉండేందుకు బ్యాచిలర్లకు అనుమతి లేదని మా సొసైటీలో రూల్ ఉంది. ఫ్యామిలీలకు మాత్రం ఆ రూల్ లేదంట’ అని రెడిట్‌లో ఓ యూజర్ రాసుకొచ్చారు. వారిపై చర్యలు తీసుకోవచ్చా అని యూజర్లను అడిగారు. ఇంకో ఇంటికి మారడం మంచిదని నెటిజన్లు సూచించారు.
News December 4, 2025
179 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇంపాల్‌లో 179 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PhD, పీజీ, NET ఉత్తీర్ణతతో పాటు బోధన/ రీసెర్చ్‌లో అనుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.57,700 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PWBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://cau.ac.in/


