News April 6, 2024
BREAKING: కాంగ్రెస్ సభలో BRS MLA

TG: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ తుక్కుగూడలో నిర్వహిస్తోన్న జన జాతర సభకు భద్రాచలం BRS ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. కాసేపట్లో రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం గూటికి చేరనున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి సహా పలువురు ఎంపీలు కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే.
Similar News
News December 28, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 28, 2025
నా ప్రాణానికి ముప్పు: MLC దువ్వాడ

AP: తన ప్రాణానికి <<18684111>>ముప్పు<<>> ఉందని MLC దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. తనకు ఏమైనా జరిగితే దానికి ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదే కారణమని ఆరోపించారు. ఈ మేరకు శ్రీకాకుళం SPని కలిసి ఫిర్యాదు చేశారు. 2+2 గన్మెన్లను కేటాయించాలని కోరారు. కొద్ది రోజులుగా తనకు ఫోన్లో, ప్రత్యక్షంగా బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడే వారిని అణచివేయాలనే ధోరణి సరికాదని మీడియాతో అన్నారు.
News December 28, 2025
ఉజ్జయిని ఆలయానికి రూ.100 కోట్ల విరాళాలు

MPలోని ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయానికి ఈ ఏడాది ₹107.93 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయి. ఇందులో ₹13 కోట్ల విలువైన బంగారం ఉండటం గమనార్హం. ఈ ఏడాది డిసెంబర్ 15 వరకు 5.5 కోట్ల మంది ఆలయాన్ని దర్శించుకున్నారు. సగటున రోజూ 1.5L-2L మంది వస్తున్నారు. సెలవుల్లో రద్దీ ఎక్కువగా ఉంటోందని, క్రిస్మస్ రోజున 2.5 లక్షల మంది దర్శనానికి వచ్చారని ఆలయ కమిటీ తెలిపింది. న్యూఇయర్ దాకా మరో 6 లక్షల మంది వస్తారని చెప్పింది.


