News November 29, 2024
BREAKING: ‘లగచర్ల’ భూసేకరణ రద్దు

TG: లగచర్ల వివాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ భూసేకరణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వికారాబాద్ జిల్లా లగచర్ల ప్రాంతంలో ఫార్మా విలేజ్ ఏర్పాటుకు గతంలో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం 632 ఎకరాల భూసేకరణకు ప్రయత్నించిన అధికారులపై ప్రజలు తిరగబడటంతో వివాదం మొదలైంది. పలువురు రైతులను పోలీసులు అరెస్టు చేశారు.
Similar News
News November 13, 2025
కిడ్నీ రాకెట్ కుంభకోణం.. మెడికల్ ఆఫీసర్ శాశ్వతి సస్పెండ్

కిడ్నీ రాకెట్ కుంభకోణం కేసులో ఉన్న మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రి అపోలో డయాలసిస్ మెడికల్ ఆఫీసర్ శాశ్వతి, మేనేజర్ బాలరంగడు అలియాస్ బాలును సస్పెండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్కు చెందిన అపోలో రీజనల్ మేనేజర్ ముఖేశ్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి నివేదికను ఎబీవీపీ కమీషనర్కు సబ్మిట్ చేస్తున్నట్లు చెప్పారు.
News November 13, 2025
ప్రజాప్రతినిధుల తొలగింపు బిల్లు.. 31మందితో జేపీసీ

తీవ్ర నేరారోపణలతో అరెస్టై 30 రోజులు జైల్లో ఉండే ప్రజాప్రతినిధుల తొలగింపు బిల్లును పరిశీలించేందుకు BJP MP అపరాజిత సారంగీ నేతృత్వంలో 31 మంది సభ్యుల JPC ఏర్పాటైంది. ఇందులో BJP నుంచి 15 మంది, NDA పార్టీల నుంచి 11 మంది ఉన్నారు. కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని కీలక పార్టీలు జేపీసీని బహిష్కరించడంతో మిగతా విపక్ష పార్టీలకు చోటు దక్కింది. వీటిలో ఎన్సీపీ-ఎస్పీ, అకాలీదళ్, ఎంఐఎం, వైసీపీ ఉన్నాయి.
News November 13, 2025
నానబెట్టిన మెంతులు మంచివేనా?

మెంతుల్లో ఎ, బి,సి, కె విటమిన్లతో పాటు ఫైబర్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ముఖ్యంగా మెంతులను నానబెట్టుకుని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఇవి షుగర్, బరువును తగ్గించడంతో పాటు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు, బీపీ మందులు వాడేవారు, గర్భిణులు వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాతే సరైన మోతాదులో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.


