News January 12, 2025

BREAKING: వెంకటేశ్, రానాలపై కేసు నమోదు

image

హైదరాబాద్‌ ఫిల్మ్ నగర్‌లోని డెక్కన్ కిచెన్ కూల్చివేతపై సినీ నటులు వెంకటేశ్, రానా, అభిరామ్‌, సురేశ్ బాబులపై కేసు నమోదైంది. సిటీ సివిల్ కోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉండగా డెక్కన్ కిచెన్ కూల్చివేశారని లీజుకు తీసుకున్న నందకుమార్ నాంపల్లి కోర్టుకు వెళ్లారు. వారిపై కేసు నమోదు చేయాలని ఫిలింనగర్ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. దీంతో 448, 452, 458, 120B సెక్షన్ల కింద పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

Similar News

News January 12, 2025

ఐఫోన్ తర్వాత యాపిల్ కొత్తగా ఏం తీసుకురాలేదు: జుకర్‌బర్గ్

image

టెక్ దిగ్గజం యాపిల్‌పై మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ విమర్శలు గుప్పించారు. ఆ సంస్థ ఆవిష్కరణ సామర్థ్యాన్ని కోల్పోయిందని తేల్చిచెప్పారు. ‘ఐఫోన్ అద్భుతమే. సగానికి పైగా ప్రపంచం ఆ ఫోన్లను వాడుతోంది. కానీ ఆ తర్వాత వేరే ఆవిష్కరణను యాపిల్ తీసుకురాలేకపోయింది. స్టీవ్ జాబ్స్ కనిపెట్టిన ఉత్పత్తిపైనే 20 ఏళ్లుగా ఆ కంపెనీ బతుకుతోంది. ప్రజల్ని పీల్చి పిప్పి చేసి లాభాలు దండుకుంటోంది’ అని పేర్కొన్నారు.

News January 12, 2025

ఛాంపియన్స్ ట్రోఫీకి బంగ్లాదేశ్ జట్టు ఎంపిక

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది. సీనియర్ ప్లేయర్లు షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్‌కు జట్టులో చోటు దక్కలేదు. జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (C), సౌమ్య సర్కార్, తంజిద్ హసన్, తౌహిద్ హృదోయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, జాకీర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, పర్వేజ్ హొస్సేన్, నసుమ్ అహ్మద్, హసన్ షకీబ్, నహీద్ రాణా

News January 12, 2025

కుంభమేళా వెనుక కథ ఏంటంటే..

image

కుంభమేళా గురించిన తొలి ప్రస్తావన రుగ్వేదంలో వచ్చింది. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమృత కుంభం నుంచి నాలుగు చుక్కలు ప్రయాగరాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని నగరాల్లో పడ్డాయని ప్రతీతి. ఆ పవిత్రతను పురస్కరించుకుని నగరాల్లోని నదుల్లో 12ఏళ్లకోసారి జరిపే వేడుకే కుంభమేళా. త్రివేణీ సంగమంలో రేపటి నుంచి 45 రోజుల పాటు ఈ అద్భుత కార్యక్రమం ఆవిష్కృతం కానుంది. కోట్ల సంఖ్యలో భక్తులు పోటెత్తనున్నారని అంచనా.