News November 28, 2024

BREAKING: కొండా సురేఖపై కేసు నమోదు

image

TG: నాంపల్లి <<14736444>>కోర్టు<<>> ఆదేశాలతో మంత్రి కొండా సురేఖపై కేసు నమోదైంది. BNS 356 కింద ఆమెపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కేసు నమోదు చేసింది. సమంత-నాగచైతన్య విడాకులు తీసుకోవడంలో నాగార్జున ప్రమేయం ఉందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.

Similar News

News November 1, 2025

ఫ్రీ Ai.. బ్యాగ్రౌండ్ రీజన్స్ ఏంటంటే..?

image

మొన్న Grok Aiని మస్క్, నిన్న perplexity Aiని ఎయిర్‌టెల్, తాజాగా గూగుల్ Gemini Aiని ఫ్రీగా ఇస్తున్నట్లు జియో ప్రకటించాయి. ఎందుకు ఈ ఫ్రీ పోటీ అంటే.. మార్కెట్లో డామినెంట్, డాన్ అయితేనే యాడ్స్ వస్తాయిగా. సో.. మార్కెట్ వాటా పొందడం రీజన్1. R2: యూజర్స్ సెర్చ్ డేటా, బిహేవియర్ అర్థం చేసుకోవడం. R3: ప్రస్తుతం తొలి స్టేజ్‌లోని Ai బ్రౌజింగ్ యూజర్స్ ఇన్‌పుట్స్‌తో స్కిల్స్, సర్వీస్ తదితరాలు ఇంప్రూవ్ చేసుకోవడం.

News November 1, 2025

సూర్యరశ్మి వల్ల ఇన్ని లాభాలా..!

image

ప్రతిరోజూ 30 నిమిషాల పాటు సూర్యరశ్మి(ఉదయం/సాయంత్రం)లో ఉండటం ఆరోగ్యకరమని వైద్యులు చెబుతున్నారు. ‘సూర్యరశ్మి విటమిన్-Dని అందిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది సెరోటోనిన్‌ను విడుదల చేసి మానసిక స్థితిని ఉత్తేజపరుస్తుంది. ఉదయం సూర్యకాంతి నిద్ర నాణ్యతను పెంచుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, దీర్ఘాయువుకు దోహదపడుతుంది’ అని సూచిస్తున్నారు. SHARE IT

News November 1, 2025

తిరుమల కొండపై విశేష పర్వదినాలు

image

నవంబర్ 1: ప్రబోధనైకాదశి, పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
నవంబర్ 2: కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస దీక్ష సమాప్తి.
నవంబర్ 5: కార్తీక పౌర్ణమి గరుడ సేవ
నవంబర్ 9: కార్తీక వన భోజనం
నవంబర్ 15: సర్వ ఏకాదశి
నవంబర్ 17: ధన్వంతరి జయంతి
నవంబర్ 18: మాస శివరాత్రి
నవంబర్ 25: తిరుమంగైయాళ్వార్ ఉత్సవారంభం