News July 22, 2024
BREAKING: ప్రత్యేక హోదాపై కేంద్రం కీలక ప్రకటన

బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. పారిశ్రామిక అభివృద్ధి కోసం బిహార్, ఇతర వెనుకబడిన రాష్ట్రాలకు హోదా ఇవ్వాలని జేడీయూ ఎంపీ మండల్ అడిగిన ప్రశ్నకు ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ‘హోదా పొందడానికి గల 5 అర్హతలు బిహార్‌కు లేవని ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్ (IMG) నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం స్పెషల్ స్టేటస్ కుదరదు’ అని తేల్చి చెప్పారు.
Similar News
News November 19, 2025
రాష్ట్రపతి ప్రశ్నలు.. రేపు అభిప్రాయం చెప్పనున్న SC

బిల్లుల ఆమోదం, సమయపాలన అంశాలకు <<17597268>>సంబంధించి <<>>రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము లేవనెత్తిన 14 ప్రశ్నలపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం రేపు అభిప్రాయాన్ని వెల్లడించనుంది. తమిళనాడు సర్కారు వేసిన పిటిషన్ విచారణలో బిల్లుల ఆమోదానికి గవర్నర్, రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీం తీర్పునిచ్చింది. దీనిపై న్యాయసలహా కోరుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టుకు ముర్ము 14 ప్రశ్నలు వేశారు.
News November 19, 2025
సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు గిల్ దూరం!

SAతో తొలి టెస్టులో మెడనొప్పికి గురైన IND కెప్టెన్ గిల్ రెండో టెస్టుకు దూరమయ్యారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. తొలి టెస్టులో బ్యాటింగ్ ఆర్డర్ వైఫల్యంతో ఘోర ఓటమి మూటగట్టుకున్న భారత్‌కు గిల్ దూరమవడం పెద్ద ఎదురుదెబ్బని చెప్పవచ్చు. అతడి ప్లేస్‌లో BCCI సాయి సుదర్శన్‌ను తీసుకుంది. పంత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ నెల 22 నుంచి గువాహటిలో రెండో టెస్ట్ ప్రారంభం అవుతుంది.
News November 19, 2025
వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు

TG: చలి, పొగమంచు పెరుగుతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో HYD ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సూచనలు చేశారు. ‘నెమ్మదిగా నడుపుతూ అలర్ట్‌గా ఉండండి. మంచులో హైబీమ్ కాకుండా లోబీమ్ లైటింగ్ వాడండి. ఎదుటి వాహనాలకు సురక్షిత దూరాన్ని మెయిన్టైన్ చేయండి. సడెన్ బ్రేక్ వేస్తే బండి స్కిడ్ అవుతుంది. మొబైల్ వాడకుండా ఫోకస్డ్గా ఉండండి. వాహనం పూర్తి కండిషన్లోనే ఉందా అని చెక్ చేసుకోండి’ అని సూచించారు.


