News January 7, 2025
BREAKING: ప్రణబ్ ముఖర్జీ స్మారకానికి కేంద్రం అనుమతి
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారకానికి కేంద్రం అనుమతించింది. తమ కుటుంబం అడగనప్పటికీ PM మోదీజీ న్యూఇయర్ గిఫ్ట్గా దీనిని బహూకరించారని ఆయన కుమార్తె శర్మిష్ఠ అన్నారు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. జనవరి 1నే లేఖ వచ్చినప్పటికీ ప్రభుత్వం ప్రకటించేంత వరకు ఎవరికీ చెప్పలేదన్నారు. ప్రణబ్తో అనుబంధాన్ని మోదీ గుర్తు చేసుకున్నారని వివరించారు. మన్మోహన్ సింగ్ స్మారకాన్ని కాంగ్రెస్ వివాదాస్పదం చేసిందన్నారు.
Similar News
News January 12, 2025
విటమిన్-డి లభించే ఆహారమిదే..
శరీరంలో రోగనిరోధక శక్తి కోసం విటమిన్-డి చాలా అవసరం. ఉరుకుల పరుగుల జీవితంలో ఎండలోకి వెళ్లక కొందరిలో విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. అలాంటి వారు విటమిన్-డి లభించే ఆహారం తీసుకోవడం వల్ల దానిని అధిగమించవచ్చు. పుట్ట గొడుగులు, గుడ్డు పచ్చసొన, ఆరెంజ్ జ్యూస్, సాల్మన్ చేప, పాల ఉత్పత్తులు, పొద్దుతిరుగుడు గింజలు, నెయ్యి వంటివి తీసుకుంటే శరీరానికి మేలు చేస్తాయి.
News January 12, 2025
స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు వీఆర్ఎస్
AP: విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగులకు స్వచ్ఛంద విరమణ పథకాన్ని(వీఆర్ఎస్) ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1 తర్వాత ఉద్యోగంలో ఉన్నవారికి ఇది వర్తిస్తుందని, ఆలోపు రిటైర్ అయ్యేవారికి కుదరదని తెలిపింది. అర్హత కలిగిన వారు ఈ నెల 15 నుంచి 31 తేదీల మధ్యలో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కాగా.. ప్రైవేటీకరణలో భాగంగానే మేనేజ్మెంట్ ఈ పథకాన్ని తీసుకొచ్చిందని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆరోపించింది.
News January 12, 2025
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ
ఢిల్లీలో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ బరిలోకి దిగుతోంది. ఢిల్లీలో మొత్తం 70 నియోజకవర్గాలుండగా మైనారిటీ ఓట్లు కీలకంగా ఉన్న 10 నుంచి 12 చోట్ల ఆ పార్టీ పోటీ చేయనున్నట్లు సమాచారం. వీటిలో చాందినీ చౌక్, కార్వాన్ నగర్ వంటి కీలక స్థానాలున్నాయి. ఇప్పటికే రెండు స్థానాల్లో ఆ పార్టీ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. వచ్చే నెల 5న ఎన్నికలు జరగనుండగా, అదే నెల 8న ఫలితాల్ని ప్రకటించనున్నారు.