News December 17, 2024

జమిలి ఎన్నికల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం

image

జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ఇంట్రడ్యూస్ చేశారు. ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది. బిల్లు కోసం బీజేపీ, కాంగ్రెస్ సహా చాలా పార్టీలు విప్ జారీ చేయడం తెలిసిందే.

Similar News

News October 22, 2025

రూ.10వేల కోట్లతో ‘S-400’ కొనుగోలు

image

‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్థాన్ మిస్సైళ్లు, డ్రోన్లను విజయవంతంగా నేలకూల్చిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను భారీగా కొనుగోలు చేయాలని భారత్ యోచిస్తోంది. రష్యా నుంచి రూ.10వేల కోట్ల విలువైన ఈ ఆయుధ వ్యవస్థల కోసం ఇప్పటికే భారత ఎయిర్‌ఫోర్స్ చర్చలు జరిపిందని ANI వెల్లడించింది. 5 S-400ల కోసం 2018లో భారత్ రష్యాతో డీల్ సైన్ చేసింది. మరోవైపు బ్రహ్మోస్ క్షిపణుల బలోపేతానికి భారత్-రష్యా కలిసి పని చేస్తున్నాయి.

News October 22, 2025

ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత.. సీఎం సంతకం

image

TG: స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రూల్‌ను తొలగించే పంచాయతీరాజ్ చట్ట సవరణ ఫైల్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు. గురువారం మంత్రివర్గ ఆమోదం తర్వాత ఈ ఫైల్ గవర్నర్ వద్దకు వెళ్లనుంది. ఆయన సంతకం తర్వాత ఆర్డినెన్స్ జారీ చేస్తారు. దాని ప్రకారం వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎంత మంది పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చు.

News October 22, 2025

మీ విషెస్‌కు థాంక్స్ ట్రంప్‌: మోదీ

image

దీపావళి సందర్భంగా విష్ చేసిన US అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ‘మీ ఫోన్ కాల్‌కు థాంక్స్. ఈ పండుగ నాడు మన రెండు ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచాన్ని ప్రకాశింపజేయడాన్ని కొనసాగించాలి. టెర్రరిజానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలి’ అని పేర్కొన్నారు. కాగా 2 దేశాల మధ్య వాణిజ్యం గురించి <<18068579>>మోదీతో మాట్లాడినట్లు<<>> ట్రంప్ తెలిపారు. వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.