News June 15, 2024
BREAKING: పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం

AP: CM హోదాలో తొలిసారి మంగళగిరి TDP ఆఫీసుకు వచ్చిన చంద్రబాబు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పార్టీ కార్యాలయంలో బారికేడ్లు ఏంటి? కార్యకర్తలను కలిసేటప్పుడు ఇవి పెట్టవద్దు. నాకు, ప్రజలకు మధ్య అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదు. ప్రజల సమస్యలు, వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థ రూపొందిస్తాం. నిర్దిష్ట సమయంలో ఇవి పరిష్కారం అయ్యేలా చూస్తాం. ప్రజా వినతుల స్వీకరణకు సమయం కేటాయిస్తా’ అని ఆయన వెల్లడించారు.
Similar News
News November 4, 2025
రేపు కార్తీక పౌర్ణమి.. ఇలా చేస్తే?

ఇవాళ రా.10.30 నుంచి రేపు సా.6.48 వరకు పౌర్ణమి తిథి ప్రభావం ఉంటుందని పండితులు చెబుతున్నారు. సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు తిథి ప్రభావం ఎక్కువగా ఉండటంతో రేపు వ్రతం చేసుకోవాలని సూచిస్తున్నారు. రేపు ఉ.4:52-5.44 వరకు నదీ స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించాలి. సా.5.15-7.05 వరకు దీపారాధాన చేసేందుకు మంచి సమయమని చెబుతున్నారు. ఈ రోజున 365 వత్తులతో దీపారాధన చేస్తే దోషాన్ని నివారించవచ్చని సూచిస్తున్నారు.
News November 4, 2025
మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వరా: KTR

నిన్న మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను టోయింగ్ వ్యాన్లో తరలించడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. ‘మరణంలోనూ కనీస గౌరవం లేకపోవడం బాధాకరం. రాష్ట్రంలో అంబులెన్స్లు / మార్చురీ వ్యాన్లు లేవా? చనిపోయిన వారికి & వారి కుటుంబాలకు కనీస గౌరవం ఇవ్వకుండా అమానవీయంగా ప్రవర్తించారు. తోపుడు బండ్లు, ట్రాక్టర్లు, చెత్త వ్యాన్లు, టోయింగ్ వాహనాలపై ఇలా తీసుకెళ్లడం ఏంటి’ అంటూ X వేదికగా మండిపడ్డారు.
News November 4, 2025
మెనోపాజ్లో ఒత్తిడి ప్రభావం

మెనోపాజ్ దశలో శరీరంలో తలెత్తే హార్మోన్ల మార్పుల కారణంగా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, చిరాకు, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అధిగమించే మార్గాల గురించి నిపుణులను, తోటి మహిళలను అడిగి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నచ్చిన పనులు చేయడం, కంటి నిండా నిద్ర పోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.


