News July 4, 2024
BREAKING: చంద్రబాబు ధోరణి మార్చుకోవాలి: వైఎస్ జగన్

AP: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా అరెస్టు చేశారని YS జగన్ మండిపడ్డారు. నెల్లూరు జైలులో ఆయనను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకు ఓటేయలేదనే కారణంతో రాష్ట్రంలో ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. పైగా బాధితులపైనే దొంగ కేసులు పెడుతున్నారు. ఇంత దారుణంగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు. CBN ధోరణి మార్చుకోవాలి. లేదంటే ప్రజలే బుద్ధి చెబుతారు’ అని హెచ్చరించారు.
Similar News
News October 28, 2025
కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై CBN భేటీ

AP: రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉపసంఘంతో CM CBN సమీక్ష చేపట్టారు. గతంలో జరిగిన అశాస్త్రీయ విభజనతో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించే పలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు. పునర్విభజనలో ప్రస్తుత కొన్ని జిల్లాల భౌగోళిక సరిహద్దులను మార్పు చేయనున్నారు. నేతలు, సంఘాల వినతి మేరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై చర్చిస్తున్నారు. Dy CM పవన్ కళ్యాణ్, మంత్రులు భేటీలో పాల్గొన్నారు.
News October 28, 2025
మునగ సాగు.. ఎకరాకు రూ.4 లక్షల ఆదాయం

మునగ సాగుతో అధిక ఆదాయం పొందుతున్నారు కర్ణాటకకు చెందిన ఉమేశ్రావు. 2010 నుంచి 10 ఎకరాల భూమిలో సహజ ఎరువులు వాడుతూ మునగసాగు చేస్తున్నారు. మార్కెట్లో మునగాకులపొడికి ఉన్న డిమాండ్ చూసి దాన్నే తయారు చేసి వివిధ కంపెనీలకు విక్రయిస్తున్నారు. ఏటా ఎకరాకు రూ.4 లక్షల చొప్పున 10 ఎకరాల నుంచి రూ.40 లక్షల ఆదాయం పొందుతున్నారు.✍️ ప్రతిరోజూ ఇలాంటి కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News October 28, 2025
మీరు వాడే పసుపు నాణ్యమైనదేనా? ఇలా చెక్ చేయండి

అన్ని రకాల వంటల్లో పసుపుదే కీలకపాత్ర. అయితే ఇటీవల కల్తీ పసుపు మార్కెట్లోకి వస్తోంది. దీన్ని గుర్తించడానికి కొన్ని చిట్కాలున్నాయి. ఒక గ్లాసు వెచ్చని నీళ్లలో చెంచా పసుపు వేసి 20ని. ఉంచాలి. స్వచ్ఛమైనదైతే గ్లాస్ అడుగుకు పసుపు చేరుతుంది. పైకి తేలితే కల్తీ. అలాగే చేతిపైన కొద్దిగా పసుపు వేసి కాసేపు నలపాలి. మృదువుగా అనిపించి రంగు మారకుంటే నాణ్యమైనది. గరుకుగా ఉండి రంగు మారితే నకిలీ.


