News December 20, 2024
BREAKING: అసెంబ్లీలో గందరగోళం

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభాపతి గడ్డం ప్రసాద్పైకి పేపర్లు విసిరారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఇదే సమయంలో తమపై కాంగ్రెస్ సభ్యులు పేపర్లు విసిరారంటూ, షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య చెప్పు చూపించారని బీఆర్ఎస్ MLAలు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఇరువర్గాల తీరుతో సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు.
Similar News
News December 5, 2025
మీరు ఇలాగే అనుకుంటున్నారా?

మనం అనేక వ్రతాలను ఆచరిస్తాం. ఏదో ఒక రోజున మన కోరిక నెరవేరినప్పుడు, అది చివరి సారి చేసిన వ్రత ఫలితమే అనుకుంటాము. ఆ ఒక్క వ్రతాన్నే గొప్పదని భావిస్తాము. అంతకుముందు చేసిన వ్రతాల శక్తిని తక్కువగా అంచనా వేస్తాము. కానీ, ఈ విజయం అన్ని వ్రతాల సంచిత ఫలితమని గ్రహించాలి. ఒక దుంగ నూరవ దెబ్బకు పగిలితే, అందుకు మొదటి 99 దెబ్బలు ఎలా కారణమవుతాయో మనం చేసిన చిన్న చిన్న వ్రతాల ఫలితాలు కూడా అంతే. ఏ వ్రతం చిన్నది కాదు.
News December 5, 2025
రెండేళ్లలో 6 గ్యారంటీలకు ₹76,382 కోట్లు

TG: రెండేళ్ల పాలనలో 6 గ్యారంటీల అమలుకు ₹76,382 కోట్లు ఖర్చు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి ₹8,402Cr, ₹500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్కు ₹700Cr, గృహజ్యోతి ₹3,438Cr, ఇందిరమ్మ ఇళ్లకు ₹3,200 Cr, ఆరోగ్యశ్రీ ₹3,000 Cr, రైతు భరోసా ₹20,616Cr, యంగ్ ఇండియా స్కూళ్లకు ₹15,600Cr ఖర్చు చేసినట్లు వెల్లడించింది. రెండేళ్లలో 61,379 ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొంది.
News December 5, 2025
అఖండ-2పై లేటెస్ట్ అప్డేట్

ఫైనాన్స్, లీగల్ ఇష్యూలతో అఖండ-2 సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఓ డిస్ట్రిబ్యూటర్ ఫైనాన్షియర్లకు ఇవ్వాల్సిన బకాయిలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని సినీవర్గాలు వెల్లడించాయి. అలాగే బాలకృష్ణ, బోయపాటి తమ రెమ్యునరేషన్లో కొంతభాగం వదులుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమకు రావాల్సిన రూ.28 కోట్లు+వడ్డీలో ఇప్పటికిప్పుడు 50% చెల్లించాలని <<18465729>>ఈరోస్<<>> డిమాండ్ చేస్తోందట. దీనిపై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది.


