News April 12, 2024
BREAKING: సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

TG: ధాన్యం కొనుగోళ్లు, నీటి సరఫరాపై సమీక్షలో అధికారులపై CM రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ‘కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే చర్యలు తీసుకోవాలి. గేటెడ్ కమ్యూనిటీలకు ఎక్కువ నీరు ఇచ్చి.. బస్తీలకు తక్కువ నీరు ఇచ్చే సిబ్బందిపై నిఘా పెట్టాలి. ధాన్యం కొనుగోళ్లలో తరుగు తీస్తే చర్యలు తప్పవు. ధాన్యం పక్కదారి పట్టించే మిల్లర్లపై నిఘా పెట్టాలి. MSP కన్నా తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయవద్దు’ అని స్పష్టం చేశారు.
Similar News
News January 9, 2026
భారత్‌కు వెనిజులా నుంచి క్రూడాయిల్?

రష్యా క్రూడాయిల్ కొనకుండా భారత్‌పై టారిఫ్స్‌తో అమెరికా ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ కంట్రోల్‌లోని వెనిజులా చమురును ఇండియాకు అమ్మాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘వెనిజులా ఆయిల్‌ను గ్లోబల్‌గా మార్కెట్ చేయాలని US యత్నిస్తోంది. ఇండియాకు అమ్మేందుకూ సిద్ధంగా ఉంది’ అని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. కాగా 50M బ్యారెళ్ల ఆయిల్‌ను వెనిజులా తమకు <<18798755>>అందజేస్తుందని<<>> ట్రంప్ ప్రకటించడం తెలిసిందే.
News January 9, 2026
DGPకి హైకోర్టులో ఊరట

TG: DGP శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. నాలుగు వారాల్లో DGP పూర్తిస్థాయి నియామకం జరగాలని UPSC సహా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
News January 9, 2026
టికెట్ రేట్ల పెంపు.. ఇరు వైపుల నుంచి విమర్శలు

‘Rajasaab’ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించడంపై విమర్శలు వస్తున్నాయి. అఖండ2కు హైక్‌పై హైకోర్టు చీవాట్లతో ఇకపై టికెట్ రేట్లు పెంచబోమని సినిమాటోగ్రఫీ మంత్రి వెంకట్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఎన్నిసార్లు ప్రకటించి పక్కనబెడతారు అని ప్రజలు, విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. అటు ఇవాళ రిలీజ్ ఉంటే 8న అర్ధరాత్రి తర్వాత పర్మిషన్ వస్తే ఏం లాభమని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. మీ Comment?


