News May 30, 2024

BREAKING: కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

image

జూన్ 2న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు హాజరుకావాలంటూ మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపారు. తాను ఆహ్వానిస్తున్నట్లుగా లేఖను స్వయంగా అందించాలంటూ సలహాదారు హర్కర వేణుగోపాల్‌ను ఆయన ఆదేశించారు. లేఖతో పాటు ఆహ్వాన పత్రాన్ని వేణుగోపాల్ రేపు కేసీఆర్‌కు అందించే అవకాశం ఉంది. మరోవైపు దశాబ్ది వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ హాజరు కానున్నారు.

Similar News

News October 14, 2024

స్పెషల్ బస్సుల్లోనే ధరలు పెంచాం: సజ్జనార్

image

బస్సు ఛార్జీలు పెంచినట్లు వస్తోన్న వార్తల్లో వాస్తవం లేదని TGSRTC ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. 2003లో జీవో- 16 ప్రకారం స్పెషల్ బస్సులకు మాత్రమే ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. ‘రెగ్యుల‌ర్ స‌ర్వీస్‌ల టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదు. ర‌ద్దీకి అనుగుణంగా ప్ర‌తి రోజు 500 స్పెష‌ల్ బ‌స్సులను సంస్థ న‌డుపుతోంది. వీటిలో మాత్రమే ఛార్జీలు పెంచాం. మిగతా రోజుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయి’ అని స్పష్టం చేశారు.

News October 14, 2024

ఇండియా-A కెప్టెన్‌గా తిలక్‌వర్మ

image

అక్టోబర్‌లో జరిగే ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో ఇండియా-A జట్టుకు హైదరాబాదీ క్రికెటర్ తిలక్‌వర్మ కెప్టెన్సీ చేయనున్నారు. అతడికి డిప్యూటీగా అగ్రెసివ్ ఓపెనర్ అభిషేక్‌శర్మ వ్యవహరించనున్నారు. ఈ టోర్నీ ఒమన్ వేదికగా అక్టోబర్ 18-27 మధ్య జరగనుంది. గ్రూప్‌-Aలో బంగ్లాదేశ్-A, శ్రీలంక-A, అఫ్గానిస్థాన్-A, హాంకాంగ్ ఉండగా గ్రూప్-Bలో ఇండియా-A, పాకిస్థాన్-A, UAE, ఒమన్ ఉన్నాయి.

News October 14, 2024

DANGER: అలాంటి టీ తాగుతున్నారా?

image

చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగడం అలవాటు. కొందరు ఒకేసారి ఎక్కువగా టీ పెట్టుకొని మరలా కాచుకొని తాగుతుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టీ కాచుకున్న 15-20 నిమిషాల్లోపు తాగడం మంచిదని చెప్పారు. దీనిని విస్మరిస్తే జీర్ణశయాంతర వ్యవస్థ, ముఖ్యంగా కాలేయం దెబ్బతింటుందన్నారు. జపాన్‌లో కాచి పక్కన పెట్టిన టీని పాము విషం కంటే ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారని తెలిపారు.