News June 27, 2024
BREAKING: సీఎస్ నీరభ్ కుమార్ పదవీకాలం పొడిగింపు

AP: రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ నీరభ్ కుమార్ పదవీకాలాన్ని డీవోపీటీ పొడిగించింది. ఆయన ఈ నెలాఖరుతో రిటైర్ కావాల్సి ఉంది. కాగా సీఎం చంద్రబాబు వినతితో ఆయన సర్వీస్ను మరో 6 నెలలు పొడిగిస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ విభాగం ఉత్తర్వులిచ్చింది. దీంతో ఆయన డిసెంబర్ 31 వరకు బాధ్యతల్లో కొనసాగనున్నారు.
Similar News
News January 7, 2026
సంక్రాంతి.. స్పెషల్ బస్సుల్లో ఛార్జీల పెంపు

TG: సంక్రాంతికి స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంచినట్లు TGSRTC ప్రకటించింది. 2003లో ఇచ్చిన జీవో ప్రకారం టికెట్ ధరపై 1.5 రెట్ల వరకు సవరించామని పేర్కొంది. దీంతో రూ.100 ఉన్న టికెట్ రూ.150 కానుంది. TGతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్ బస్సులకే ఇది వర్తించనుంది. ఈ నెల 9, 10, 12,13 తేదీలతో పాటు తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 18, 19 తేదీల్లో మాత్రమే పెరిగిన ఛార్జీలు అమల్లో ఉంటాయని RTC వివరించింది.
News January 7, 2026
మన దగ్గరా అవకాడోను సాగు చేయొచ్చు

‘అవకాడో’ .. బ్రెజిల్, సెంట్రల్ అమెరికా ప్రాంతానికి చెందిన ఈ పండు ఇప్పుడు మనదేశంలోనూ పండుతోంది. ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీర ప్రాంతాలు వీటి సాగుకు అనుకూలమంటున్నారు శాస్త్రవేత్తలు. ఉద్యాన పంటల్లో భాగంగా అవకాడోను సాగుచేసి లాభాలు పొందవచ్చని సూచిస్తున్నారు. విత్తనం నుంచి పెరిగిన అవకాడో చెట్ల పండ్లను ఉత్పత్తి చేయడానికి 4-6 ఏళ్లు పడుతుంది, అయితే అంటుకట్టిన మొక్కలు 1-2 ఏళ్లలో ఫలాలను ఉత్పత్తి చేస్తాయి.
News January 7, 2026
మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్.. ఏది బెటర్?

ఈ ప్రశ్న తరచూ వినిపిస్తుంటుంది. నిజానికి రెండూ బెటరే. ఫిక్స్డ్ డిపాజిట్స్(FD)తో ఓ గ్యారంటీ, కంఫర్ట్ ఉంటుంది. నిర్ణీత వడ్డీ రేటుతో మెచ్యూరిటీ సమయంలో డబ్బు అందుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్(MF)ను పెద్ద కంపెనీల్లో పెట్టుబడిగా పెడతారు. దీంతో దీర్ఘకాలంలో మంచి రాబడులు అందుతాయి. FD స్క్రూడ్రైవర్ లాంటిదైతే, MF పవర్ డ్రిల్ లాంటిదని నిపుణులు చెబుతారు. రిటర్న్స్, ట్యాక్స్ వంటి విషయాల్లో MF బెటర్ ఆప్షన్.


