News June 29, 2024
BREAKING: డి.శ్రీనివాస్ కన్నుమూత

TG: మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్దకుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు.
Similar News
News January 21, 2026
బంగ్లాదేశ్పై PIL… కోర్టు సీరియస్

బంగ్లాదేశ్లో హిందువులను హింసిస్తున్నందున ఆ దేశాన్ని క్రికెట్ టోర్నమెంట్ల నుంచి నిషేధించాలని ఢిల్లీ హైకోర్టులో PIL దాఖలైంది. లా విద్యార్థి దాఖలు చేసిన దీనిపై చీఫ్ జస్టిస్ ఉపాధ్యాయ సీరియస్ అయ్యారు. ‘ఇదేం పిటిషన్. ఆ దేశం మా పరిధిలోకి వస్తుందా? మేము అక్కడికి వెళ్లి విచారించాలా? ICC మా పరిధిలోదా?’ అని ప్రశ్నించారు. హెచ్చరికతో వదిలేస్తున్నామని, సమాజంలో చేయాల్సినవి చాలా ఉన్నాయని హితవు పలికారు.
News January 21, 2026
CEOగా తప్పుకున్న దీపిందర్

బ్లింకిట్, జొమాటో ప్లాట్ఫామ్స్ పేరెంట్ కంపెనీ ‘ఎటర్నల్’ CEOగా దీపిందర్ గోయల్ తప్పుకోనున్నారు. ఈ Feb 1 నుంచి బ్లింకిట్ ఫౌండర్ అల్బిందర్ ధిండ్సా ఈ బాధ్యతలు చేపట్టనుండగా, గోయల్ వైస్ ఛైర్మన్గా కొనసాగుతారు. ప్రస్తుత వ్యాపార పరిస్థితులకు తగ్గట్లు కొత్త మార్గాలు అన్వేషించేందుకు, అదే సమయంలో నాయకత్వ స్థాయిలో క్లియర్ ఫోకస్ ఉండేందుకే ఈ మార్పులు అని గోయల్ తెలిపారు.
News January 21, 2026
అమ్మాయిలతో ఎలా మెలగాలో అబ్బాయిలకు క్లాసులు!

బ్రిటన్ పాఠశాలల్లో విద్యార్థులకు వినూత్నరీతిలో పాఠాలు బోధిస్తున్నారు. ఆడపిల్లలను ఎలా గౌరవించాలి, వారితో ఎలా మర్యాదగా ప్రవర్తించాలనే అంశాలపై అబ్బాయిలకు స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలు ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించడం, బాధ్యతగా మెలగడం వంటి విలువలను నేర్పిస్తే వేధింపులను అరికట్టవచ్చని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి విధానం ఇండియాలోనూ తీసుకురావాలనే చర్చ జరుగుతోంది.


