News August 20, 2025

BREAKING: రాష్ట్రంలో తీవ్ర విషాదం

image

AP: కర్నూలు (D) ఆస్పరి (M) చిగిలిలో విషాదం నెలకొంది. నీటి కుంటలో ఈతకు వెళ్లిన ఆరుగురు చిన్నారులు మృతిచెందారు. చనిపోయిన చిన్నారులంతా ఐదో తరగతి విద్యార్థులు అని స్థానికులు తెలిపారు. మృతులను శశికుమార్, సాయి, కిరణ్, భీమ, వీరేంద్ర, మహబూబ్‌గా గుర్తించారు. వారి మృతదేహాలను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆరుగురు చిన్నారుల మృతి పట్ల మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

Similar News

News March 21, 2026

8 గంటల ప్రయాణం తర్వాత విమానం యూటర్న్!

image

ఢిల్లీ నుంచి వాంకోవర్‌(కెనడా)కు బయల్దేరిన ఎయిరిండియా విమానం ప్రయాణికులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. 8Hr ప్రయాణం తర్వాత తిరిగి ఢిల్లీలోనే ల్యాండైంది. కెనడాలో ఆ ఫ్లైట్‌కు పర్మిషన్ లేకపోవడమే ఇందుకు కారణం. ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 777-300ER విమానాలకు కెనడాలో అనుమతి ఉండగా, 777-200LRను పంపింది. చైనా గగనతలంలోకి వెళ్లాక తెలియడంతో అధికారులు వెనక్కి రప్పించారు. తర్వాత వేరే విమానంలో ప్రయాణికులను పంపారు.

News March 21, 2026

దేశాన్ని అమ్మేశారు.. కేంద్రంపై మమత ఫైర్

image

ఇంధన ధరలు పెంచాలని కేంద్రం ప్లాన్ చేస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. దేశాన్ని అమ్మేశారని మండిపడ్డారు. ‘మన్మోహన్ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉండేది. ఇప్పుడు రూ.1,100 చేశారు. రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతాయి’ అని చెప్పారు. మరోవైపు బెంగాల్‌లో అప్రకటిత రాష్ట్రపతి పాలన నడుస్తోందని ఫైరయ్యారు. ప్రధాని మోదీ నుంచి దేశాన్ని కాపాడటమే తనకు ప్రాధాన్యమని అన్నారు.

News March 21, 2026

SLBCలో రెండు వైపులా తవ్వకాలు: ఉత్తమ్

image

TG: SLBC ఇన్‌లెట్ తవ్వకాల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ‘ఇప్పటికే దేవరకొండ నుంచి ఔట్‌లెట్ పనులు జరుగుతున్నాయి. రెండు వైపులా నిరంతరాయంగా పనులు కొనసాగుతున్నాయి’ అని తెలిపారు. భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రూల్స్ కఠినంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. సొరంగ మార్గంలో గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సచివాలయంలో జరిగిన సమీక్షలో సూచించారు.