News February 12, 2025
BREAKING: అకౌంట్లో డబ్బుల జమ

TG: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3 ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.6వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసినట్లు తెలిపింది. జనవరి 26న ఈ పథకం కింద ప్రభుత్వం నిధుల జమను ప్రారంభించింది. ఫిబ్రవరి 5న 17.03 లక్షల మందికి, ఫిబ్రవరి 10న 8.65 లక్షల మందికి విడతల వారీగా నిధులు జమ చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News January 20, 2026
మున్సిపాలిటీల్లో చీరల పంపిణీ ప్రారంభం

TG: మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభమైంది. తొలి దశలో 67 మున్సిపాలిటీలలో 5 లక్షల చీరలు పంపిణీ చేయనున్నారు. ఈ నెల 31 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. రెండో దశలో మున్సిపల్ ఎన్నికలకు ముందు 60 మున్సిపాలిటీల్లో పంపిణీ చేస్తారు. రాష్ట్రంలో కోటి చీరల పంపణీ లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరలు పంపిణీ చేసింది.
News January 20, 2026
మంగళూరు రిఫైనరీ & పెట్రోకెమికల్స్ లిమిటెడ్లో పోస్టులు

<
News January 20, 2026
ఉల్లిలో ఊదారంగు మచ్చ తెగులు – నివారణకు సూచనలు

ఉల్లి పంటలో కనిపించే తెగుళ్లలో ఉదారంగు మచ్చ తెగులు ఒకటి. అధిక వర్షాలు, అధిక తేమ ఉన్న సమయంలో ఈ తెగులు ప్రధాన పొలంలో ఎక్కువగా వ్యాపిస్తుంది. దీని నివారణకు రైతులు ముందుగానే లీటరు నీటికి కార్బండజిమ్ 1గ్రా. లేదా ప్రొపికొనజోల్ 1ml కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు మార్చిమార్చి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


