News September 24, 2025

BREAKING: రైల్వే ఉద్యోగులకు పండగ బోనస్

image

రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 78 రోజుల ఉత్పత్తి ఆధారిత బోనస్‌ ప్రకటించింది. ఈ మేరకు నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు రూ.1,866 కోట్లను ఇవ్వనుంది. దీంతో ఆ కేటగిరిలోని ఒక్కో ఉద్యోగికి రూ.17,951 వరకు అందనుంది. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో 10.91 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.

Similar News

News February 1, 2026

పేదల ఆకలి తీర్చేందుకు ₹2,27,429 కోట్లు

image

పేదల ఆహార భద్రత కోసం కేంద్రం బడ్జెట్లో ఇతోధిక నిధులు కేటాయించింది. PMGKAYకు ₹2,27,429 కోట్లు బడ్జెట్లో చూపింది. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) పరిధిలో ఉన్న 80 కోట్ల మందికి పైగా పేదలకు నెలకు ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున ఉచిత రేషన్ కింద గోధుమలు/బియ్యం అందిస్తారు. గత ఏడాది ఈ స్కీమ్ కింద ప్రభుత్వం ₹2,27,754 కోట్లు ఖర్చు చేసింది.

News February 1, 2026

NDDB రిపోర్టు వచ్చాకే జంతు కొవ్వులు ఉన్నాయని చెప్పా: చంద్రబాబు

image

AP: కల్తీ నెయ్యి ఘటనపై NDDB రిపోర్టు వచ్చాకే తాను మాట్లాడానని సీఎం చంద్రబాబు చెప్పారు. అందులో జంతు కొవ్వులు ఉన్నాయని, కల్తీ చేశారని అప్పుడే చెప్పానన్నారు. దీనిపై వైసీపీ నేతలు నానాయాగి చేసి సుప్రీంకోర్టుకు వెళ్లారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల పవిత్రతను కాపాడేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారని హెచ్చరించారు.

News February 1, 2026

ట్యాక్స్ మిస్టేక్స్.. శిక్షల నుంచి రిలీఫ్!

image

బడ్జెట్‌లో ట్యాక్స్ పేయర్లకు కొన్ని విషయాల్లో ఊరట కల్పించారు. అప్పీల్‌కు ముందు కట్టాల్సిన ప్రీపేమెంట్‌ను 20% నుంచి 10%కి తగ్గించారు. రీఅసెస్‌మెంట్ మొదలైనా 10% అదనపు పన్నుతో రిటర్న్స్ అప్‌డేట్ చేసుకోవచ్చు. ₹20 లక్షల లోపు విదేశీ ఆస్తులను వెల్లడించకపోయినా జైలు శిక్ష ఉండదు. అసెస్‌మెంట్, పెనాల్టీలకు ఒకే ఆర్డర్ వస్తుంది. తప్పుగా రిపోర్ట్ చేసినా 100% అదనపు ట్యాక్స్ కడితే శిక్షలు ఉండవు.