News January 2, 2025

BREAKING: మరోసారి భూప్రకంపనలు

image

AP: ప్రకాశంలో మరోసారి భూప్రకంపనలు కలకలం రేపాయి. ముండ్లమూరు పరిసర ప్రాంతాల్లో సెకన్ పాటు భూమి కంపించింది. భయాందోళనలకు గురైన స్థానికులు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Similar News

News January 3, 2026

ప్రముఖ నటుడికి యాక్సిడెంట్

image

ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గువాహటిలో భార్య రూపాలీతో కలిసి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. స్థానికులు వెంటనే ఆశిష్ దంపతులను హాస్పిటల్‌కు తరలించారు. తనకు స్వల్ప గాయాలైనట్లు ఆయన SM ద్వారా వెల్లడించారు. తన భార్యను ఇంకా పరిశీలనలో ఉంచారని చెప్పారు. అభిమానులు ఆందోళన చెందవద్దన్నారు. ఆశిష్‌ విద్యార్థి తెలుగులో పోకిరి, చిరుత సహా అనేక సినిమాలు చేశారు.

News January 3, 2026

మంచి పశుగ్రాసానికి ఉండాల్సిన లక్షణాలు

image

పాడి పశువులకు అందిచే గ్రాసం రుచిగా, ఎక్కువ మాంసకృత్తులు కలిగి ఉండాలి. తక్కువ కాలంలో కోతకు వచ్చి ఎక్కువ దిగుబడి ఇచ్చేదిగా ఉండాలి. నీటి ఎద్దడిని తట్టుకొని ఏ దశలో కోసినా రుచికరంగా ఉండాలి. ఎలాంటి విష పదార్థాలు ఉండకూడదు. అన్ని కాలాల్లో మంచి దిగుబడిని ఇవ్వాలి. అన్ని రకాల నేలల్లో తక్కువ నీటితో సాగు చేసుకోగలినదై ఉండాలి. తెగుళ్లను తట్టుకునేలా, కోసిన తర్వాత రోజుల తరబడి నిల్వచేసుకొనుటకు వీలుగా ఉండాలి.

News January 3, 2026

సుదర్శన చక్రం ఆవిర్భావం, విశిష్టత

image

రాక్షసుల ఆగడాల నుంచి లోకాన్ని రక్షించడానికి శక్తిమంతమైన ఆయుధం అవసరమని భావించిన విష్ణుమూర్తి, శివుడిని ప్రార్థించారు. శివపురాణం ప్రకారం.. శివుడే అత్యంత విధ్వంసకరమైన సుదర్శన చక్రాన్ని విష్ణువు కోసం సృష్టించి బహుకరించాడు. ఒక్కసారి ప్రయోగిస్తే లక్ష్యాన్ని ఛేదించి తిరిగి వచ్చే ఈ దివ్యాయుధం, ధర్మస్థాపనలో కీలక పాత్ర పోషించింది. సృష్టికర్త శివుడు కాగా, దానిని ధరించి లోక కల్యాణం గావించింది మహావిష్ణువు.