News March 18, 2024
BREAKING: చంద్రబాబుకు ఈసీ నోటీసులు
AP: YSRCP ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. సీఎం జగన్పై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు చేస్తోందని, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. FB, ట్విటర్, యూట్యూబ్ ద్వారా జగన్ వ్యక్తిత్వంపై దాడి చేసే విధంగా ప్రచారం చేస్తోందని పేర్కొన్నారు. దీంతో 24 గంటల్లోగా అసభ్యకర పోస్టులను తొలగించాలని సీఈవో ఆదేశించారు.
Similar News
News October 31, 2024
దీపావళి: ఈ జాగ్రత్తలు మరవకండి
* లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే క్రాకర్స్ కొనండి.
* వాహనాల దగ్గర, కరెంట్ వైర్ల కింద, డ్రైనేజీ సమీపంలో బాణసంచా కాల్చడం ప్రమాదకరం.
* గాలి వీచే సమయంలో రాకెట్ల వంటి పైకి ఎగిరే టపాసులు కాల్చకండి.
* కాల్చిన బాణసంచాను నీరు నింపిన బకెట్లో వేయండి.
* ఆస్తమా శ్వాస సంబంధిత సమస్యలున్న వారు టపాసులకు దూరంగా ఉండండి. నాణ్యమైన మాస్క్లు ధరించండి.
> SHARE
News October 31, 2024
స్థలం, రేషన్కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు?
TG: దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది సొంత స్థలం, రేషన్ కార్డున్న వారికే ఇల్లు ఇవ్వాలని భావిస్తోందని తెలుస్తోంది. ఈ నిబంధన వల్ల ఎక్కువగా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఒకవేళ స్థలం, రేషన్ కార్డున్న వారికే ఇస్తే 30లక్షల దరఖాస్తులు బుట్టదాఖలు కావాల్సి ఉంటుంది.
News October 31, 2024
దీపావళి వేళ ఈ 5 ప్రదేశాల్లో దీపాలు పెట్టండి!
దీపావళి పర్వదినాన ఇంట్లోని కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో దీపాలు వెలిగించాలని వేద పండితులు చెబుతున్నారు. ఇంటి గడపకు ఇరువైపులా, వంట గది, ధాన్యాగారం, తులసికోట, రావిచెట్టు కింద దీపం పెట్టాలని సూచిస్తున్నారు. దీంతో పాటు ఆలయాలు, మఠాలు, గోశాలలు, వృక్షాలు, ఇంట్లోని ప్రతి మూలలోనూ దీపాలు వెలిగిస్తే మంచిదని చెబుతున్నారు. నాలుగు వీధుల కూడలిలో దీపం వెలిగించాలంటున్నారు.