News April 4, 2024
BREAKING: చంద్రబాబుకు ఈసీ నోటీసులు

AP: టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో ఆయన ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని వైసీపీ ఫిర్యాదు చేసింది. సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు కంప్లైంట్ చేశారు. దీంతో బాబుకు నోటీసులు ఇచ్చిన ఈసీ.. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
Similar News
News December 3, 2025
జిల్లాలో 941 సర్పంచ్, 2,927 వార్డు నామినేషన్లు

జగిత్యాల జిల్లాలో రెండో విడతకు సంబంధించి 122 గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.సత్యప్రసాద్ తెలిపారు. సర్పంచ్ స్థానాలకు 941, వార్డు సభ్యుల స్థానాలకు 2,927 నామినేషన్లు వచ్చాయని చెప్పారు. నామినేషన్ల ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా కొనసాగిందని ఆయన పేర్కొన్నారు.
News December 3, 2025
మరో మైలురాయికి చేరువలో రోహిత్ శర్మ

టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నారు. మరో 41 రన్స్ చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో 20వేల పరుగులు చేసిన 4వ భారత బ్యాటర్గా అవతరించనున్నారు. 503 మ్యాచ్లలో 42.46 సగటు, 50 సెంచరీలు, 110 హాఫ్ సెంచరీలతో 19,959 పరుగులు చేశారు. సచిన్ 34,357, కోహ్లీ 27,808, ద్రవిడ్ 24,064 రన్స్తో మొదటి 3 స్థానాల్లో ఉన్నారు. కాగా సౌతాఫ్రికా, భారత్ మధ్య నేడు 2వ వన్డే జరగనుంది.
News December 3, 2025
4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసం ప్రత్యేకత

4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని అన్ని రకాల నేలల్లో కొద్ది నీటి వసతితో పెంచవచ్చు. ఇది ఏడాదికి 6-7 సార్లు కోతకు వస్తుంది. దీనిలో తీపిదనం ఎక్కువగా ఉండటం వల్ల పశువులు ఇష్టంగా తింటాయి. ఎకరం గడ్డి 10 ఆవులకు సరిపోతుంది. దీనిలో ప్రొటీన్ కంటెంట్ 16-18 శాతంగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువ. దీని వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి మరింత పెరుగుతుంది. దీని ఆకులు మృదువుగా ఉండటం వల్ల రైతులు కోయడం కూడా సులభం.


