News May 24, 2024
Breaking: ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

TG: ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెల 27 నుంచి మూడు విడతలుగా ప్రవేశాల ప్రక్రియ జరగనుంది. ఆ నెల 30 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. జులై 12న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయిస్తారు. జులై 19 నుంచి రెండో విడత కౌన్సెలింగ్, 24 నుంచి రెండో విడత సీట్ల కేటాయింపు, జులై 30 నుంచి తుది విడత కౌన్సెలింగ్, ఆగస్టు 5న తుదివిడత సీట్లను కేటాయించనున్నారు.
Similar News
News December 5, 2025
గచ్చిబౌలి శాంతిసరోవర్లో ‘సండే ఈవినింగ్ టాక్’

బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని శాంతిసరోవర్ క్యాంపస్లో ఆదివారం ‘సండే ఈవినింగ్ టాక్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. సా.6:30 నుంచి రాత్రి 8 గం. వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ‘విలువ వినోదం’ (వాల్యూటెయిన్మెంట్) పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విలువల కార్యకలాపాలు, దైవిక గీతాలాపన, ధ్యాన అనుభవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
News December 5, 2025
జుట్టు చివర్లు చిట్లుతున్నాయా..?

వాతావరణ మార్పుల వల్ల వెంట్రుకల చివర్లు చిట్లడం ఎక్కువైపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లు తలస్నానం చెయ్యాలి. తలస్నానానికి మైల్డ్ షాంపూలు వాడటం మంచిది. బయటకి వెళ్తున్నప్పుడు జుట్టంతా కప్పిఉంచుకోవాలి. తలస్నానం తర్వాత హెయిర్ సీరం వాడటం మంచిది. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మెడికేటెడ్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకూడదు. అయినా సమస్య తగ్గకపోతే ఒకసారి ట్రైకాలజిస్ట్లను సంప్రదించాలి.
News December 5, 2025
గూగుల్ డేటా సెంటర్కు 480 ఎకరాలు

AP: విశాఖలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్కు 480 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. విశాఖ(D)లోని తర్లువాడ, అడవివరం, అనకాపల్లి(D)లోని రాంబిల్లిలో భూమిని ఇచ్చేందుకు అంగీకరించింది. గూగుల్ విజ్ఞప్తి మేరకు ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న అదానీ ఇన్ఫ్రా పేరున కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దశల వారీగా వెయ్యి మెగా వాట్ల ఏఐ డేటా సెంటర్ను గూగుల్ ఏర్పాటు చేయనుంది.


