News March 20, 2024

BREAKING: పరీక్ష వాయిదా

image

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ బోర్డు సెక్రటరీ పుల్లయ్య కీలక ఉత్తర్వులు జారీ చేశారు. మే 17న జరగాల్సిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష(పాలీసెట్)ను వాయిదా వేస్తూ ప్రకటన విడుదల చేశారు. మే 24న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

Similar News

News November 25, 2024

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

image

నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలు కానున్నాయి. వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ సమావేశాలు సాగనున్నాయి. ఈ సెషన్‌లో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉండగా వక్ఫ్ సహా 16 బిల్లులపై చర్చించనున్నారు. సభలో చర్చించే అంశాలపై లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్ పర్సన్ ఆమోదం తర్వాతే పార్లమెంటులో చర్చ జరుగుతుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.

News November 25, 2024

ప్రపంచంలో భూమికి అత్యంత దూరమైన ప్రదేశం ఇదే

image

న్యూజిలాండ్‌కి, చిలీకి మధ్య ఉన్న దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న పాయింట్ నీమో అనే ప్రాంతాన్ని ప్రపంచంలో అత్యంత ఒంటరితనంగా ఉండే ప్రాంతంగా పరిశోధకులు చెబుతుంటారు. 1992లో దీన్ని గుర్తించారు. ఇక్కడి నుంచి కనుచూపు మేరలో భూమి కనిపించదు. దగ్గర్లోని భూమి 2688 కిలోమీటర్ల దూరంలో ఉంది. కరెక్ట్‌గా చెప్పాలంటే భూమి కంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమే నీమో పాయింట్‌కు దగ్గరగా(400 కి.మీ) ఉంటుంది.

News November 25, 2024

శివసేన శాసనసభాపక్ష నేతగా షిండే

image

మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. శివసేన షిండే వర్గం ఏక్‌నాథ్ షిండేను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. ఓ హోటల్‌లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఆయనను ఎన్నుకుంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అంతకుముందు అజిత్ పవార్‌ను ఎన్సీపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. రేపటితో ప్రభుత్వ పదవికాలం పూర్తి కానుండటంతో ఆ లోపే సీఎం అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశముంది.