News March 26, 2024
BREAKING: కుమారుడికి ఎగ్జామ్స్.. బెయిల్ కోరిన కవిత

MLC కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కవిత కుమారుడి పరీక్షల నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు చెప్పారు. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సమాధానం ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని ఈడీ కోరింది. ఇరువైపులా వాదనలు విన్న రౌస్ అవెన్యూ న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
Similar News
News January 14, 2026
ధోనీకే సాధ్యం కానిది.. రాహుల్ రికార్డు

భారత ప్లేయర్ KL రాహుల్ ధోనీకి కూడా సాధ్యం కాని ఘనత సాధించారు. వన్డేల్లో న్యూజిలాండ్‌పై సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్ బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. రాజ్‌కోట్ వేదికగా వన్డేల్లో శతకం చేసిన తొలి ఇండియన్ కూడా ఈయనే. ఓవరాల్‌గా రాహుల్‌కిది వన్డేల్లో ఎనిమిదో సెంచరీ. ఈ ఏడాదిలో భారత్ తరఫున ఇదే తొలి అంతర్జాతీయ శతకం. సెంచరీ చేసిన సమయంలో తన కూతురుకు అంకితం ఇస్తున్నట్లుగా రాహుల్ సెలబ్రేట్ చేసుకున్నారు.
News January 14, 2026
మేము కాకుంటే రష్యా, చైనా గ్రీన్‌ల్యాండ్‌ను సొంతం చేసుకుంటాయి: ట్రంప్

తమ నేషనల్ సెక్యూరిటీ కోసం గ్రీన్‌ల్యాండ్ అవసరం అని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. తాము అమెరికాలో చేరబోమని, డెన్మార్క్‌లోనే ఉంటామని గ్రీన్‌ల్యాండ్ ప్రధాని ప్రకటించడంపై ట్రంప్ స్పందించారు. ‘గ్రీన్‌ల్యాండ్ అమెరికా చేతుల్లో ఉండటం వల్ల నాటో మరింత స్ట్రాంగ్ అవుతుంది. మేము కాకుంటే రష్యా, చైనా గ్రీన్‌ల్యాండ్‌ను సొంతం చేసుకుంటాయి. అది జరగనివ్వను’ అని పోస్ట్ చేశారు.
News January 14, 2026
-40 మార్కులు వస్తే డాక్టరా?.. ఆందోళన!

నీట్ పీజీ-2025లో రిజర్వ్‌డ్(SC,ST,BC) కేటగిరీలో <<18852584>>కటాఫ్<<>> తగ్గింపుపై డాక్టర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. -40 మార్కులు వచ్చినా క్వాలిఫై అయినప్పుడు ఎగ్జామ్ ఎందుకని ప్రశ్నలు లేవనెత్తింది. కేవలం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ట్రైనింగ్, ప్రాక్టీస్, సర్జరీల్లో పాల్గొనే అవకాశం కల్పించేలా ఉన్న ఈ నిర్ణయం బాధాకరమని తెలిపింది. కటాఫ్ తగ్గింపుపై పునరాలోచన చేయాలని, ఇది వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని చెబుతోంది.


