News December 5, 2024

BREAKING: ప్రయోగం విజయవంతం

image

శ్రీహరికోటలోని SHAR అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన PSLV-C59 ప్రయోగం విజయవంతమైంది. సరిగ్గా సాయంత్రం 4.04 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3లోని రెండు ఉపగ్రహాలను ISRO కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా సూర్యుడి వాతావరణంలోని అత్యంత వేడి పొర అయిన సోలార్ కరోనాను అధ్యయనం చేయనున్నారు.

Similar News

News February 10, 2026

ప్రైవేటుకు 4 NHలు.. జాబితాలో ఏపీ హైవే

image

AP: నాలుగు రాష్ట్రాల్లోని 260 కి.మీ పొడవైన 4 జాతీయ రహదారులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. వీటికి రూ.9,500 కోట్లు చెల్లిస్తామని RIIT చేసిన ఆఫర్‌కు NHAI ఆమోదం తెలిపింది. ఇందులో 69 కి.మీ పొడవైన విజయవాడ-చిలకలూరిపేట హైవే కూడా ఉంది. మిగిలిన రహదారులు తమిళనాడు, కర్ణాటక, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ఉన్నాయి.

News February 10, 2026

షమీకే ఎందుకిలా?

image

గాయంతో జట్టుకు దూరమై రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న బౌలర్ మహ్మద్ షమీకి మరోసారి నిరాశే ఎదురైంది. తాజాగా <<19095739>>BCCI<<>> ప్రకటించిన కాంట్రాక్ట్‌లో ఆయనకు చోటు దక్కలేదు. గత కొంతకాలంగా దేశవాళీలో ఆడుతున్నప్పటికీ అతడిని జట్టులోకి తీసుకోకపోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టు లిస్టులోనూ పేరు లేకపోవడంతో BCCI అతడిని పక్కనపెట్టిందా అనే చర్చ జరుగుతోంది. షమీ గతేడాది మార్చిలో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు.

News February 10, 2026

కోసిన మిరప పంటను ఇలా ఎండబెడితే మేలు

image

పంట నుంచి కోసిన మిరపకాయలను కుప్పగా పోసి టార్పాలిన్‌తో ఒక రోజంతా కప్పి ఉంచాలి. ఇలా చేస్తే కాయలు అన్నీ ఒకేలా పండుతాయి. తర్వాత కాయలను పాలిథీన్ పట్టాలపై లేదా శుభ్రం చేసిన కాంక్రీటు కల్లాల మీద ఆరబెట్టాలి. ఇసుక లేదా పేడ అలికిన కల్లాలపై ఆరబెట్టకూడదు. రాత్రిపూట కాయలను పట్టాలతో కప్పి ఉదయం ఎండరాగానే పట్టా తీసేయాలి. మిరపలో తేమ 10-11% వరకు వచ్చేలా ఎండబెట్టాలి. లేకపోతే రంగును, మెరుపును కోల్పోయే అవకాశం ఉంది.