News October 4, 2025
BREAKING: ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంపు

TG: హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో బస్సు ఛార్జీలను పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు ఈనెల 6నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. మొదటి 3 స్టేజీల వరకు రూ.5 చొప్పున, 4వ స్టేజీ నుంచి రూ.10 చొప్పున అదనపు ఛార్జీ వసూలు చేయనుంది. సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఇ-ఆర్డినరీ, ఇ-ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పెంచిన ఛార్జీలు అమలుకానున్నాయి.
Similar News
News October 5, 2025
జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికకు కమిటీ వేసిన BJP

TG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికకు ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు పార్టీ తరఫున ఎవరిని నిలబెడితే బాగుంటుందో నేతల నుంచి ఈ కమిటీ అభిప్రాయాలను సేకరిస్తుంది. M.ధర్మారావ్(Ex. MLA), పోతుగంటి రాములు(Ex.MP), బీజేపీ సీనియర్ నేత కోమల ఆంజనేయులు(అడ్వకేట్)ను కమిటీ సభ్యులుగా నియమించారు.
News October 5, 2025
ఆలస్యం చేస్తే ఊరుకోను.. ట్రంప్ వార్నింగ్

తన ప్రకటనపై హమాస్ వేగంగా స్పందించాలని అమెరికా అధ్యక్షుడు <<17906657>>ట్రంప్ హెచ్చరించారు<<>>. ‘బందీలను విడుదల చేసేందుకు, శాంతి ఒప్పందాన్ని అమలు చేసేందుకు తాత్కాలికంగా బాంబింగ్ ఆపినందుకు ఇజ్రాయెల్‌ను అభినందిస్తున్నా. హమాస్ వైపు నుంచి ఏదైతే జరుగుతుందని అందరూ భావిస్తున్నారో అలాంటి ఆలస్యాన్ని నేను సహించను. బందీలను విడుదల చేసే ప్రక్రియను త్వరగా పూర్తి చేయండి. అందరితో న్యాయంగా వ్యవహరిస్తాం’ అని SMలో పోస్ట్ చేశారు.
News October 5, 2025
దసరా స్పెషల్.. ఆర్టీసీకి ₹110 కోట్ల ఆదాయం

దసరా నేపథ్యంలో ₹110 కోట్ల ఆదాయం సమకూరినట్లు TGSRTC తెలిపింది. 7,754 స్పెషల్ బస్సులు తిప్పాలని నిర్ణయించినా ప్రయాణికులు లేకపోవడంతో 5,300 బస్సులే నడిపినట్లు వెల్లడించింది. గతేడాది 6,300 ప్రత్యేక బస్సులు వేయగా ₹114 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొంది. ఈసారి సొంతూళ్లకు వెళ్లేవారి సంఖ్య తగ్గడం, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించడంతో ఆదాయం తగ్గినట్లు వివరించింది. కాగా ఇవాళ, రేపు బస్సుల్లో రద్దీ పెరిగే ఛాన్స్ ఉంది.