News May 15, 2024
Breaking: పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం

AP: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చినగంజాం నుంచి హైదరాబాద్ వస్తున్న అరవింద ప్రైవేట్ ట్రావెల్ బస్సును లారీ ఢీ కొట్టింది. లారీలో చెలరేగిన మంటలు బస్సుకు అంటుకోవడంతో బస్సు డ్రైవర్ సహా ఆరుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఓటేసేందుకు వెళ్లి తిరిగొస్తున్న 30మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు సమాచారం.
Similar News
News March 10, 2026
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ కోల్పోయిన ఫ్యామిలీ మెంబర్స్ వీళ్లే

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ వ్యక్తిగత జీవితంలో తీరని విషాదం నెలకొంది. ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడుల్లో ఆయన కుటుంబం ఛిన్నాభిన్నమైంది. ఆయన తండ్రి అలీ ఖమేనీ, తల్లి మన్సూరే ఖోజస్తే మరణించగా తర్వాతి దాడుల్లో భార్య (జహ్రా హదాద్ అడెల్), ఒక కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు ఒక సోదరి, బావ, ఇద్దరు పిల్లలు సహా మొజ్తబా మొత్తం 8 మంది కుటుంబ సభ్యులను కోల్పోయినట్లు సమాచారం.
News March 10, 2026
‘గడ్డి మందు’ అమ్మకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

TG: సాగులో కలుపు నివారణకు వాడుతున్న పారాక్వాట్ డైక్లోరైడ్ రైతుల ప్రాణాలకు ముప్పుగా మారింది. దీంతో దాని విక్రయాలపై ప్రభుత్వం పరిమితులు విధించింది. ఇకపై వ్యవసాయ అధికారులు పొలాలను పరిశీలించి, గడ్డి మందు అవసరమని భావిస్తేనే కొనుగోలు కోసం రైతులకు ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలని ఆదేశించింది. దాని ఆధారంగానే అన్నదాతలకు మందులను విక్రయించాలని, ఇందుకు ప్రత్యేక రిజిస్టర్ మెయింటెన్ చేయాలని షాపులకు సూచించింది.
News March 10, 2026
కూతురికి బర్త్‌డే విషెస్.. అరుదైన ఫొటోలు షేర్ చేసిన చిరు

తన కుమార్తె సుష్మిత కొణిదెల పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన అరుదైన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. చిన్నప్పుడు ఊయలలో ఉన్నప్పటి నుంచి నేడు తండ్రి సినిమాకే నిర్మాతగా మారి పక్కన నిల్చున్న వరకు ఉన్న జర్నీని గుర్తుచేసుకున్నారు. ‘నా సినిమాలు చూసే స్థాయి నుంచి నాతో సినిమా తీసి బ్లాక్‌బస్టర్ ఇచ్చే స్థాయికి ఎదగడం తండ్రిగా మర్చిపోలేని అనుభూతి’ అంటూ చిరు ఎమోషనల్ పోస్ట్ రాసుకొచ్చారు.


