News February 16, 2025

BREAKING: ఏపీలో తొలి GBS మరణం

image

AP: రాష్ట్రంలో తొలి గులియన్ బార్ సిండ్రోమ్<<15225307>>(GBS)<<>> మరణం నమోదైంది. ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన మహిళ గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇటీవల తెలంగాణలోనూ సిద్దిపేటకు చెందిన మహిళ <<15405226>>జీబీఎస్<<>> కారణంగా చనిపోయిన విషయం తెలిసిందే.

Similar News

News November 21, 2025

బిజినెస్ కార్నర్

image

* హోండా కార్స్ ఇండియా కొత్త SUV ఎలివేట్ ఏడీవీని లాంచ్ చేసింది. HYDలో ఎక్స్ షోరూమ్ ధర ₹15.20 లక్షల నుంచి ₹16.66 లక్షల వరకు ఉంటుంది.
* HYDకి చెందిన బయోలాజికల్-ఇ తయారుచేసిన న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ న్యూబెవాక్స్ 14కి WHO గుర్తింపు లభించింది. ఇది 14 రకాల న్యుమోనియా, మెదడువాపు, సెప్సిస్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
* అంతర్జాతీయ సంస్థలు సొనొకో, EBG గ్రూప్ HYDలో కార్యాలయాలు నెలకొల్పాయి.

News November 21, 2025

ఈ పంటలతో పురుగుల కట్టడి, అధిక దిగుబడి

image

నాటే దశ నుంచి కోత వరకు అనేక రకాలైన పురుగులు పంటను ఆశించడం వల్ల దిగుబడి తగ్గుతోంది. ఈ పురుగులను విపరీతంగా ఆకర్షించే కొన్ని రకాల ఎర పంటలతో మనం ప్రధాన పంటను కాపాడుకోవచ్చు. దీని వల్ల పురుగు మందుల వినియోగం, ఖర్చు తగ్గి రాబడి పెరుగుతుంది. వరి గట్లపై బంతిని సాగు చేసి పంటకు చీడల ఉద్ధృతిని తగ్గించినట్లే మరిన్ని పంటల్లో కూడా చేయొచ్చు. అవేంటో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News November 21, 2025

బీఎస్ఎఫ్‌లో తొలి మహిళా స్నైపర్

image

BSFలోకి మొట్టమొదటిసారి మహిళా స్నైపర్‌ ఎంటర్ అయ్యారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ జిల్లాకు చెందిన సుమన్‌ కుమారి ఇండోర్‌లోని సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ వెపన్స్‌ అండ్‌ ట్యాక్టిక్స్‌లో కఠిన శిక్షణను పూర్తిచేసి ‘ఇన్‌స్ట్రక్టర్‌ గ్రేడ్‌’ పొందారు. 2021లో BSFలో చేరిన ఆమె పంజాబ్‌లో ఓ బృందానికి నాయకత్వం వహించారు. స్నైపర్ శిక్షణ కఠినంగా ఉంటుంది. ఇందులో చేరాలనుకునేవారు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి.