News December 10, 2024

BREAKING: మాజీ సీఎం SM కృష్ణ కన్నుమూత

image

కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి SM కృష్ణ(92) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున బెంగళూరులోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణ 1989-1993 మధ్య అసెంబ్లీ స్పీకర్, 1993-94లో కర్ణాటక మొదటి డిప్యూటీ సీఎం, 1999 నుంచి 2004 వరకు సీఎం, 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్, 2009 నుంచి 2012 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు.

Similar News

News December 4, 2025

ఫ్లాట్‌లో రాత్రంతా అమ్మాయిలు.. బ్యాచిలర్లకు ఫైన్

image

బెంగళూరులో బ్యాచిలర్లకు వింత అనుభవం ఎదురైంది. ఫ్లాట్‌లో రాత్రంతా అమ్మాయిలు ఉన్నారని రెసిడెన్షియల్ సొసైటీ ₹5వేల ఫైన్ విధించింది. వారికి బిల్లు కూడా ఇచ్చింది. ‘అతిథులు రాత్రిపూట ఉండేందుకు బ్యాచిలర్లకు అనుమతి లేదని మా సొసైటీలో రూల్ ఉంది. ఫ్యామిలీలకు మాత్రం ఆ రూల్ లేదంట’ అని రెడిట్‌లో ఓ యూజర్ రాసుకొచ్చారు. వారిపై చర్యలు తీసుకోవచ్చా అని యూజర్లను అడిగారు. ఇంకో ఇంటికి మారడం మంచిదని నెటిజన్లు సూచించారు.

News December 4, 2025

179 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇంపాల్‌లో 179 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PhD, పీజీ, NET ఉత్తీర్ణతతో పాటు బోధన/ రీసెర్చ్‌లో అనుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.57,700 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PWBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://cau.ac.in/

News December 4, 2025

దీపం కొండెక్కింది అని ఎందుకు అంటారు?

image

దీపం ఆరిపోవడాన్ని మనం ‘దీపం కొండెక్కింది’ అని అంటాం. దీని వెనుక ఓ ఆధ్యాత్మిక కారణం ఉంది. సాధారణంగా మనం పర్వతాలను దైవ నివాసాలుగా భావిస్తాం. కొండలు దేవతలకు ఆశ్రయం ఇస్తాయని నమ్ముతాం. అయితే, దీపం జ్యోతి ఆరిపోయినప్పుడు, అది భౌతిక దేహాన్ని విడిచి, నేరుగా దైవంలో కలిసిపోయింది అని భావించాలి. దీపం దైవంలో ఐక్యమైందని చెప్పడానికే మనం ఆధ్యాత్మిక వ్యక్తీకరణను ఉపయోగిస్తూ ఇలా చెబుతుంటాం.