News March 16, 2024
BREAKING: చంద్రబాబుతో మాజీ మంత్రి గంటా భేటీ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళగిరి పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఇంకా టికెట్ ఖరారు కాని నేపథ్యంలో చంద్రబాబును కలిసి విశాఖ జిల్లాలోని టిక్కెట్ కేటాయించాలని గంటా కోరినట్లు ప్రచారం జరుగుతుంది. ఇంతకుముందు చీపురుపల్లిలో పోటీ చేయాలని చంద్రబాబు కోరినట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 10, 2025
విశాఖ: DRO, RDOల నియామకంలో మీనమేషాలు

విశాఖలో రెగ్యులర్ అధికారులను నియమించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. DRO, RDOల మధ్య వివాదం జరగ్గా.. ఇద్దరినీ సరెండర్ చేశారు. 2 నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు రెగ్యులర్ అధికారులను నియమించలేదు. ఇన్ఛార్జ్ హోదాల్లో ఉన్నవారు పెద్ద పెద్ద పనుల విషయంలో తలదూర్చడం లేదు. తాత్కాలికమైన పనులనే చూసుకొని వెళ్లిపోతున్నారు. దీంతో కీలక నిర్ణయాల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
News December 9, 2025
జీవీఎంసీలో అవినీతిపై కమిషనర్ ఉక్కుపాదం

జీవీఎంసీలో అవినీతిని ఉపేక్షించేది లేదని కమిషనర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలపై ఇప్పటికే ఒక డీఈఈ (DEE), టీపీవో (TPO)ను సరెండర్ చేశామని, ఏఈ (AE)పై విచారణకు ఆదేశించామని తెలిపారు. అవినీతికి పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద్యోగులంతా పారదర్శకంగా పనిచేసి నగర అభివృద్ధికి సహకరించాలని ఆదేశించారు.
News December 9, 2025
ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ, ఎస్టీ సంఘం నూతన కమిటీ ఎన్నిక

ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం డిస్కం నూతన కమిటీని విశాఖలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా సిహెచ్.సాయిబాబు, అధ్యక్షుడిగా ఎం.నిరంజన్ బాబు, జనరల్ సెక్రటరీగా ఎన్.వెంకటరావు ఎన్నికయ్యారు. మెజారిటీ సభ్యుల ఆమోదంతో ఏర్పాటైన ఈ కమిటీ మూడేళ్లు కొనసాగుతుందని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సాయిబాబు తెలిపారు.


