News November 5, 2024
BREAKING: మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత

AP: మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తన స్వగ్రామం అనకాపల్లి జిల్లా పెదగోగాడలో ఇవాళ మరణించారు. 1983 నుంచి 1999 వరకు వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. NTR హయాంలో మంత్రిగా పనిచేశారు. TTD బోర్డు మెంబర్‌గా కూడా ఆయన సేవలందించారు. కాగా మంత్రిగా కొనసాగుతున్నప్పుడు కూడా ఆయన నిరాడంబర జీవితం గడిపారు. RTC బస్సుల్లోనే ఆయన ప్రయాణించేవారు.
Similar News
News December 5, 2025
763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్( CEPTAM) 763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B పోస్టులు 561, టెక్నీషియన్-A పోస్టులు 203 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిసెంబర్ 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<
News December 5, 2025
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్‌లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.


