News November 24, 2024

మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

image

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అబ్బయ్య ఉమ్మడి ఏపీలో బూర్గంపాడు నుంచి 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 1994, 2009లో ఇల్లందు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన మృతిపట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు.

Similar News

News November 24, 2024

రేవంత్.. ఎవర్ని పిచ్చోళ్లను చేస్తున్నావ్?: KTR

image

TG: కొడంగల్‌లో నిర్మించేది పారిశ్రామిక కారిడార్ అని CM రేవంత్ చేసిన ప్రకటనపై KTR స్పందించారు. ‘ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్‌లో కొడంగల్‌లో భూసేకరణ ఫార్మా విలేజ్‌ల కోసం అని స్పష్టంగా ఉంది. నువ్వు కూడా పలుమార్లు ప్రకటించావు. తొండలు గుడ్లు పెట్టని భూములు అంటూ బాతాఖానీ కొడితివి. ఇప్పుడు ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అని మాట మార్చి ఎవర్ని పిచ్చోళ్లను చేస్తున్నావ్?’ అని ప్రశ్నించారు.

News November 24, 2024

కమెడియన్ అలీకి నోటీసులు

image

TG: ప్రముఖ కమెడియన్ అలీకి అధికారులు నోటీసులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలం ఎక్మామిడిలోని ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామ కార్యదర్శి శోభారాణి నోటీసులు ఇచ్చారు. అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని అందులో పేర్కొన్నారు.

News November 24, 2024

జగన్ క్విడ్ ప్రోకోపై ఏసీబీ విచారణ: అయ్యన్న

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఆయన అవినీతిపై CBI, ACB విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘అదానీతో కాకుండా సెకీతో ఒప్పందం చేసుకున్నామని YCP ప్రకటించింది. కానీ సెకీ నోడల్ ఏజెన్సీ మాత్రమే. అదానీ కేసుతో సెకీకి సంబంధం లేదు. జగన్ క్విడ్ ప్రోకోతో రాష్ట్రానికి తీవ్ర నష్టం చేకూరింది. ప్రజలపై అధిక విద్యుత్ ఛార్జీల భారం పడింది’ అని ఆయన మండిపడ్డారు.