News July 16, 2024

ఉగ్రవాదుల దొంగదెబ్బ.. నలుగురు జవాన్లు మృతి

image

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌తో డోడా జిల్లాలో ముష్కరుల కోసం జవాన్లు గాలింపు చేపట్టారు. ఈక్రమంలో అడవుల్లో నక్కిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో నలుగురు సైనికులు వీరమరణం పొందారని పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదుల కోసం ఆర్మీ, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా వారం రోజుల క్రితం జరిగిన ఉగ్రకాల్పుల్లో ఐదుగురు జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.

Similar News

News November 18, 2025

రెండు రోజులు జాగ్రత్త!

image

TG: రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతాయని చెప్పింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది. ఉదయం 9 గంటలైనా తీవ్రత తగ్గడం లేదు.

మూవీ ముచ్చట్లు

image

*కల్ట్ క్లాసిక్ సినిమా ‘షోలే’ డిసెంబర్ 12న థియేటర్లలో రీరిలీజ్‌ కానుంది.
*మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థతో చేతులు కలిపిన దర్శకుడు ప్రశాంత్ నీల్. పూజా కార్యక్రమంతో హారర్ చిత్రం ప్రారంభం. సమర్పకుడిగా వ్యవహరించనున్న నీల్.
* ‘వారణాసి’ వీడియోకు అద్భుత స్పందన రావడంతో సాంకేతిక బృందానికి థాంక్స్ చెప్పిన రాజమౌళి. ప్రతి ఒక్కరి పేరు ప్రస్తావిస్తూ ట్వీట్.