News March 30, 2024

BREAKING: కాంగ్రెస్‌లో చేరిన GHMC మేయర్

image

TG: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ తన నివాసంలో ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొన్ని రోజుల క్రితమే పార్టీ మారుతున్నట్లు ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయలక్ష్మి తండ్రి కేశవరావు కూడా త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నారు.

Similar News

News November 14, 2025

ఆర్జేడీకే ఎక్కువ ఓట్లు వచ్చినా..!

image

ప్రతిపక్ష ఆర్జేడీని మరోసారి పరాజయం వెంటాడింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినా అదే స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది. 143 సీట్లలో పోటీ చేసిన ఆర్జేడీ 22.84 శాతం ఓట్లు సాధించింది. ఇవి బీజేపీకి వచ్చిన ఓట్ల కంటే 1.86 శాతం, జేడీయూ కంటే 3.97 శాతం ఎక్కువ. ప్రస్తుతం 26 సీట్లలోనే ఆర్జేడీ ఆధిక్యంలో ఉండటం గమనార్హం. ఎన్డీయే 204 స్థానాల్లో లీడ్‌లో ఉంది.

News November 14, 2025

IPL: కోల్‌కతా బౌలింగ్ కోచ్‌గా సౌథీ

image

న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీని తమ జట్టు బౌలింగ్ కోచ్‌గా నియమించినట్లు KKR ప్రకటించింది. ఈ ఏడాది మొదట్లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సౌథీ.. 2021-2023 మధ్య ఐపీఎల్‌లో KKR తరఫున ఆడారు. ఇటీవలే షారుక్ ఖాన్ ఫ్రాంచైజీ అభిషేక్ నాయర్‌ను హెడ్ కోచ్‌గా, షేన్ వాట్సన్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది.

News November 14, 2025

వీటిని డీప్ ఫ్రై చేస్తే క్యాన్సర్ వచ్చే ఛాన్స్

image

బాగా ఫ్రై చేసిన కొన్ని పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాంసాన్ని డీప్ ఫ్రై చేస్తే హెటెరోసైక్లిక్ అమైన్స్, హైడ్రోకార్బన్స్, బంగాళదుంపలు, బ్రెడ్‌ డీప్ ఫ్రై చేస్తే అక్రిలైమైడ్, చికెన్‌ను డీప్ ఫ్రై చేస్తే కార్సినోజెన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి DNAను దెబ్బతీసి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. ఉడకబెట్టడం, బేకింగ్ మంచిదని సూచిస్తున్నారు.