News November 16, 2024
BREAKING: తొలి టెస్టుకు గిల్ దూరం

ఆస్ట్రేలియాతో నవంబర్ 22 నుంచి జరగాల్సిన BGT తొలి టెస్టుకు శుభ్‌మన్ గిల్ దూరమయ్యారు. ఇండియా-ఏతో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా క్యాచ్ పడుతుండగా అతడి వేలికి గాయమైంది. దీంతో తొలి టెస్టుకు అతడికి విశ్రాంతి ఇచ్చిన BCCI రెండో టెస్టు నాటికి కోలుకుంటారని భావిస్తోంది.
Similar News
News November 5, 2025
ఈ సరసమైన రీఛార్జ్ ప్యాక్స్ అవసరం.. AIRTEL, JIOలకు విజ్ఞప్తులు!

అతితక్కువ మొబైల్ డేటాను వాడే సీనియర్ సిటిజన్లు, WiFi యూజర్లను దృష్టిలో ఉంచుకుని రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టాలని AIRTEL, JIOలకు నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ‘ప్రతి నెలా ₹100 కంటే తక్కువ ధరకు వాయిస్ ఓన్లీ ప్లాన్‌లను అందించండి. అవసరం లేకపోయినా, ప్రజలు డేటాను తీసుకోవలసి వస్తుంది. డైలీ 1GB & వాయిస్ కాల్స్ ఇచ్చే నెల, వార్షిక ప్లాన్స్ ఇవ్వండి. BSNLలో సరసమైన ప్లాన్స్ ఉన్నాయి’ అని సూచిస్తున్నారు.
News November 5, 2025
ఇంటి చిట్కాలు

* కార్పెట్లను శుభ్రం చేయడానికి పావుకప్పు వెనిగర్, చెంచా మొక్కజొన్న పిండి, పావు కప్పు నీరు కలపాలి. ఈ మిశ్రమాన్ని కార్పెట్ల మీద చల్లి ఐదు నిమిషాలు ఉంచాలి. తర్వాత వాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేస్తే సరిపోతుంది.
* చెంచా కాఫీపొడి, గుప్పెడు పుదీనా ఆకులు, చెంచా బేకింగ్ సోడా, కాసిన్ని నిమ్మతొక్కలు, కొద్దిగా నిమ్మరసం ఒక గిన్నెలో వేసి ఒక మూలన ఉంచితే గది అంతా పరిమళం వ్యాపిస్తుంది.
News November 5, 2025
రోడ్డు ప్రమాదం.. నలుగురు TG వాసుల మృతి

కర్ణాటకలోని హల్లిఖేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాను, కారు ఢీకొనడంతో నలుగురు తెలంగాణ వాసులు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను సంగారెడ్డి(D) జగన్నాథ్‌పూర్ వాసులుగా గుర్తించారు. గణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి కారులో తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ‘మీర్జాగూడ’ ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.


