News December 19, 2024
BREAKING: భారీగా తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.710 తగ్గి రూ.77,130కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 తగ్గి రూ.70,700గా ఉంది. అటు వెండి ధర కేజీపై రూ.1000 తగ్గి రూ.99,000గా ఉంది.
Similar News
News November 1, 2025
కరోండా(వాక్కాయ) మొక్క.. పొలానికి రక్షణ కవచం

పంటకు రక్షణకు నేడు ఇనుప వైర్ ఫెన్స్, కాంక్రీటు స్తంభాలు వేయడానికి చాలా ఖర్చవుతుంది. అయితే పంటకు సహజ రక్షణ కవచంలా నిలుస్తోంది ‘కరోండా’. వీటినే వాక్కాయ మొక్కలు అంటారు. ఇది చిన్న పొద రూపంలో పెరుగుతుంది. దీని కాండం, కొమ్మలు ముళ్లతో నిండి ఉంటాయి. ఎండలు, తక్కువ నీరు, ఎలాంటి వాతావరణ పరిస్థితినైనా తట్టుకొని ఇది పెరుగుతుంది. ఎప్పుడూ పచ్చగా ఉండే ఈ మొక్క పొలానికి సహజమైన గోడలా మారి పంటకు రక్షణగా నిలుస్తుంది.
News November 1, 2025
కరోండా జీవకంచెతో అనేక ప్రయోజనాలున్నాయ్

కరోండా ముళ్లతో నిండి ఉండటం వల్ల పశువులు, మేకలు, అడవి పందులు, కుందేళ్లు ఈ కంచెను దాటలేవు. ఈ మొక్క వేర్లు మట్టిని బలంగా పట్టుకుంటాయి. ఫలితంగా ఇవి నేల కోతను, మృత్తికా క్రమక్షయాన్ని తగ్గిస్తాయి. పంటకు అవసరమైన తేమను నిల్వ ఉంచుతాయి. ఈ పొదల్లో పక్షులు గూళ్లు కట్టుకొని రకరకాల పురుగులను తిని పంటకు మేలు చేస్తాయి. తేనెటీగలు ఈ పూలపై తిరుగుతాయి. వీటి వల్ల పొలాల్లో పరాగసంపర్కం జరిగి పంట దిగుబడి పెరుగుతుంది.
News November 1, 2025
కరోండా(వాక్కాయ)ను ఎలా, ఎప్పుడు నాటాలి?

వర్షాకాలంలో కరోండా(వాక్కాయ)ను నాటితే బాగా పెరుగుతుంది. పొలానికి చుట్టూ ప్రతి 1 మీటరు దూరంలో ఒక మొక్క నాటాలి. మొదటి రెండేళ్లలో మొక్కలకు నీరు పోయడం, ఎరువులు వేయడం అవసరం. మూడో ఏడాది నుంచే ఇది సహజమైన జీవకంచెగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు పొదలను కొంచెం కత్తిరించి సమానంగా పెంచితే కంచె మరింత బలంగా మారి పంటకు రక్షణగా నిలుస్తుంది. అలాగే ఈ వాక్కాయ పండ్లను అమ్మి రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.


