News April 23, 2025

BREAKING: భారీగా తగ్గిన బంగారం ధర

image

ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. వారం రోజుల తర్వాత గోల్డ్ రేటు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,750 తగ్గి రూ.90,150 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.3,000 తగ్గి రూ.98,350కి చేరింది. కేజీ వెండి ధర రూ.1,11,000గా ఉంది.

Similar News

News August 14, 2025

స్టార్ ప్లేయర్ తండ్రి కన్నుమూత

image

ప్రముఖ టెన్నీస్ దిగ్గజం లియాండర్ పేస్ తండ్రి వెసీ పేస్(80) కన్నుమూశారు. అనారోగ్యంతో రెండ్రోజుల క్రితం కోల్‌కతాలోని ఆస్పత్రిలోని చేరిన ఆయన చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. వెసీ పేస్ 1972లో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టులో సభ్యుడు.

News August 14, 2025

ICET కౌన్సెలింగ్ ఎప్పుడంటే?

image

TG: MBA, MCA కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. తొలి విడతలో భాగంగా AUG 20న కౌన్సెలింగ్ ప్రారంభమై సెప్టెంబర్ 5తో ముగియనుంది. ఈ నెల 20-28 వరకు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు, స్లాట్ బుకింగ్, 22-29 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, 25-30 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. SEP 2లోపు సీట్లు కేటాయిస్తారు. రెండో విడత సెప్టెంబర్ 8న ప్రారంభమై, 16తో ముగుస్తుంది.

News August 14, 2025

ఇండిపెండెన్స్ డే: 1090 మందికి గ్యాలంట్రీ అవార్డ్స్

image

రేపు ఇండిపెండెన్స్ డే సందర్భంగా కేంద్ర హోం శాఖ పోలీసులకు గ్యాలంట్రీ అవార్డ్స్ ఇవ్వనుంది. ఈ మేరకు పోలీస్, ఫైర్, హోమ్ గార్డ్&సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్‌లో 1090 మందికి పురస్కారాలు ప్రకటించింది. వీటిల్లో గ్యాలంట్రీ మెడల్స్(GM) 233, రాష్ట్రపతి మెడల్స్(PSM) 99, మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్(MSM) 758 ఉన్నాయి. తెలంగాణకు MSM 18, PSM 2, GM 1, ఆంధ్రప్రదేశ్‌కు MSM 23, PSM 2 మెడల్స్ ప్రకటించింది.