News July 23, 2024
BREAKING: భారీగా తగ్గిన బంగారం ధరలు

బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు ఏకంగా రూ.2,990 తగ్గి, రూ.70,860కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.2,750 తగ్గి రూ.64,950గా నమోదైంది. అటు సిల్వర్ రేట్ రూ.3500 తగ్గి రూ.88 వేలకు చేరింది.
Similar News
News October 19, 2025
స్పోర్ట్స్ రౌండప్

* ప్రో కబడ్డీ సీజన్-12లో ప్లేఆఫ్స్ చేరిన తెలుగు టైటాన్స్.. 18 పాయింట్లతో ప్లేఆఫ్స్కు క్వాలిఫై
* ఇవాళ WWCలో ఇంగ్లండ్తో తలపడనున్న భారత జట్టు.. సెమీస్ రేసులో కొనసాగాలంటే టీమ్ ఇండియాకు ఈ విజయం కీలకం.. ఇప్పటికే సెమీస్ చేరిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా
* వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో ఫైనల్ చేరిన భారత షట్లర్ తన్వీ శర్మ.. నేడు థాయ్లాండ్ ప్లేయర్ అన్యాపత్తో అమీతుమీ
News October 19, 2025
ధన్వంతరీ ఎవరు?

క్షీరసాగర మథనంలో జన్మించిన వారిలో ధన్వంతరి ఒకరు. ఆయన మహా విష్ణువు అంశ. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఆయన జన్మించారు. అందుకే ఆ రోజును ధన్వంతరి జయంతిగా జరుపుకొంటాం. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం.. ధన్వంతరి, సూర్యభగవానుడి వద్ద ఆయుర్వేద జ్ఞానాన్ని పొందిన 16 మంది శిష్యులలో ఒకరు. ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి దైవంగా పూజించే ఆయనను స్మరించడం, ఆరాధించడం సకల రోగాల విముక్తిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.
News October 19, 2025
ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీలో ఇవాళ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతిలో పడే అవకాశం ఉందని పేర్కొంది. అటు TGలోని కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ఉమ్మడి MBNRలో రేపు 8.30amలోపు ఉరుములతో కూడిన వర్షాలు పడుతాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.