News November 14, 2024
BREAKING: భారీగా తగ్గిన బంగారం ధరలు
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. బులియన్ మార్కెట్లో వరుసగా నాలుగో రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,200 తగ్గి రూ.75,650 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,100 తగ్గి రూ.69,350కి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.2,000 తగ్గి రూ.99,000లు పలుకుతోంది. గోల్డ్ 4 రోజుల్లో రూ.3,710, వెండి రూ.4,000 తగ్గడం విశేషం.
Similar News
News November 14, 2024
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మహిళలకు ఆహ్వానం
TG: కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా విజయోత్సవాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. డిసెంబర్ 7న ట్యాంక్బండ్ పరిసరాల్లో, 8న సచివాలయ పరిసరాల్లో, 9న నెక్లెస్ రోడ్డులో వేడుకలు నిర్వహించనున్నారు. 9న సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని సీఎం నిర్ణయించారు.
News November 14, 2024
ఒకప్పుడు పండ్లు అమ్మారు.. ఇప్పుడు రూ.10వేల కోట్ల ఆస్తి!
సినీ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతులెవరో తెలుసా? హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ప్రకారం రూ.10వేల కోట్ల నికర విలువతో T-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అగ్రస్థానంలో ఉన్నారు. గతంలో కపూర్లు, చోప్రాలకే ఈ ట్యాగ్ ఉండేది. అయితే, ఇప్పుడు అత్యంత ధనవంతులైనప్పటికీ.. భూషన్ కుటుంబం ఒకప్పుడు పండ్లు అమ్ముకునేది. 1970లలో భూషన్ తండ్రి గుల్షన్ కుమార్ సంగీత క్యాసెట్లు విక్రయించే షాపును కొనుగోలు చేయడంతో వీరి రాత మారిపోయింది.
News November 14, 2024
పాలనకు ఏడాది.. విజయోత్సవాలపై సీఎం సమీక్ష
TG: వచ్చే నెలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో విజయోత్సవాలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన నేతలకు సూచించారు. ముఖ్యంగా మహిళా సాధికారత, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించాలని చెప్పారు. విజయోత్సవాల్లో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్ సభల్లో సీఎం పాల్గొనే అవకాశం ఉంది.