News January 3, 2025
BREAKING: భారీగా పెరిగిన బంగారం ధర
బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.870 పెరిగి రూ.79,200గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.800 పెరిగి రూ.72,600కు చేరింది. అటు కేజీ వెండి ధర ఏకంగా రూ.2000 పెరిగి రూ.1,00,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
Similar News
News January 5, 2025
ఇజ్రాయెల్ దాడుల్లో 70 మంది మృతి
పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడుల్ని తీవ్రం చేస్తోంది. శనివారం నుంచి జరిపిన 30 వేర్వేరు దాడుల్లో 70 మంది మృతి చెందారు. గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ను నిలువరించడానికి ఆ దేశ బంధీల వీడియోలను హమాస్ విడుదల చేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్కు 8 బిలియన్ డాలర్ల ఆయుధాల సరఫరాకు బైడెన్ అంగీకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటిదాకా యుద్ధంలో 45,658 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.
News January 5, 2025
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు: మంత్రి లోకేశ్
AP: ప్రధాని మోదీ విశాఖ పర్యటనను ప్రజలు విజయవంతం చేయాలని మంత్రి నారా లోకేశ్ కోరారు. 8న నగరంలో కి.మీ మేర PM రోడ్ షో ఉంటుందని పర్యటనపై సమీక్ష తర్వాత మాట్లాడారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని మరోసారి తేల్చి చెప్పారు. రుషికొండ ప్యాలెస్ తప్ప, ఉత్తరాంధ్రకు వైసీపీ ఏం చేసిందని ప్రశ్నించారు. లులు, IT కంపెనీలను తరిమేసిందని విమర్శించారు. దేశంలో భారీగా పెన్షన్ ఇస్తోంది ఏపీనే అని లోకేశ్ చెప్పారు.
News January 5, 2025
మాతృభాషను మర్చిపోతే మాతృబంధం విడిచిపోయినట్లే: వెంకయ్యనాయుడు
TG: ప్రపంచంలోనే రెండో ఉత్తమ లిపిగా తెలుగు నిలిచిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. HICCలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహా సభల్లో ఆయన ప్రసంగించారు. ‘వేష, భాషల పట్ల మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. కోపంలోనూ ఎదుటివారి మంచిని కోరుకోవడం మన సంప్రదాయం. మీ పిల్లలు చల్లగుండ.. మీ ఇల్లు బంగారంగాను అని తిట్టుకునేవారు. మాతృభాషను మర్చిపోతే మాతృబంధం విడిచిపోయినట్లే’ అని పేర్కొన్నారు.