News April 19, 2024
BREAKING: మళ్లీ పెరిగిన బంగారం ధరలు
నిన్న కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చిన గోల్డ్ రేట్స్.. ఇవాళ మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.540 పెరిగింది. దీంతో రూ.74,340కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.500 తగ్గి రూ.68,150గా నమోదైంది. అటు సిల్వర్ రేట్లు వరుసగా రెండో రోజూ స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర రూ.90,000గా ఉంది.
Similar News
News November 6, 2024
త్రివిధ దళాల సెల్యూట్లలో తేడాలివే!
ఇండియన్ ఆర్మీ సెల్యూట్: అరచేతిని ఓపెన్ చేసి, వేళ్లన్నీ కలిపి, మధ్య వేలు దాదాపు హ్యాట్‌బ్యాండ్/కనుబొమ్మలను తాకుతుంది. (చేతిలో ఏ ఆయుధాలు లేవని చెప్పడం)
ఇండియన్ నేవీ సెల్యూట్: నుదిటికి 90డిగ్రీల కోణంలో అరచేతిని ఓపెన్ చేసి నేల వైపు చూపిస్తారు. (పనిలో చేతికి అంటిన గ్రీజు కనిపించకుండా)
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెల్యూట్: నేలకు 45డిగ్రీల కోణంలో అరచేతిని ఓపెన్ చేసి చేస్తారు.(ఆకాశంలోకి వెళతామనడానికి సూచిక)
News November 6, 2024
2024 US Elections: X కేంద్రంగా నకిలీ సమాచార వ్యాప్తి
అమెరికా ఎన్నికలపై ఎలాన్ మస్క్ చేసిన నకిలీ, తప్పుడు సమాచార ట్వీట్లకు Xలో ఈ ఏడాది 2 బిలియన్ల వ్యూస్ వచ్చినట్టు సెంటర్ ఫర్ కౌంటరింగ్ డిజిటల్ హేట్ అధ్యయనంలో తేలింది. కీలక రాష్ట్రాల్లో తప్పుడు సమాచార వ్యాప్తికి X కేంద్ర బిందువుగా పని చేసిందని ఆరోపించింది. మస్క్‌కు భారీ సంఖ్యలో ఉన్న ఫాలోవర్స్ వల్ల ఇది పెద్ద ఎత్తున ఇతరుల్ని ప్రభావితం చేయడానికి వీలు కల్పించిందని ఓ ప్రొఫెసర్ తెలిపారు.
News November 6, 2024
రక్షణ మంత్రిని తొలగించిన నెతన్యాహు
గాజాతో యుద్ధం వేళ ఇజ్రాయెల్ PM నెతన్యాహు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌ను తొలగించారు. ‘కొన్ని నెలలుగా విశ్వాసం సన్నగిల్లుతోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని ఆయన ప్రకటించారు. గాలంట్ స్థానంలో ఫారిన్ మినిస్టర్ ఇజ్రాయెల్ కాజ్‌ను నియమించారు. FMగా గిడోన్ సార్ బాధ్యతలు చేపట్టారు. గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచే నెతన్యాహు, గాలంట్ మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.