News April 10, 2025
BREAKING: రికార్డు స్థాయిలో పెరిగిన గోల్డ్ రేట్

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఇవాళ రికార్డు స్థాయిలో పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఏకంగా రూ.2,700 పెరగడంతో రూ.85,600కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,940 పెరిగి రూ.93,380 పలుకుతోంది. ఈ మధ్యకాలంలో ఒకేసారి ఇంత రేటు పెరగడం ఇదే తొలిసారి. ఇక కేజీ వెండి ధర రూ.2,000 పెరిగి రూ.1,04,000కు చేరింది.
Similar News
News November 9, 2025
వంటింటి చిట్కాలు

* ఫ్రిడ్జ్‌లో బాగా వాసన వస్తుంటే ఒక చిన్న కప్పులో బేకింగ్ సోడా వేసి ఒక మూలన పెడితే వాటన్నిటినీ పీల్చుకుంటుంది.
* బంగాళదుంప ముక్కలను పదినిమిషాలు మజ్జిగలో నానబెట్టి, పదినిమిషాల తర్వాత ఫ్రై చేస్తే ముక్కలు అతుక్కోకుండా పొడిపొడిగా వస్తాయి.
* దోశలు కరకరలాడుతూ రావాలంటే మినప్పప్పు నానబెట్టేటపుడు, గుప్పెడు కందిపప్పు, స్పూను చొప్పున మెంతులు, అటుకులు వేయాలి.
News November 9, 2025
బుల్లెట్, థార్ బండ్లను అస్సలు వదలం: హరియాణా డీజీపీ

థార్ నడిపే వ్యక్తులు రోడ్లపై విన్యాసాలు చేస్తారని హరియాణా DGP ఓపీ సింగ్ అన్నారు. ‘మేం అన్ని వాహనాలను తనిఖీ చేయం. కానీ బుల్లెట్ బైక్, థార్ కార్లను అస్సలు వదలం. మీరు ఎంచుకునే వాహనాలే మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. థార్ స్టేటస్ సింబల్ అయింది. ఇటీవల ఓ ACP కొడుకు థార్ నడిపి ఒకరిని ఢీకొట్టాడు. తన కుమారుడిని రక్షించాలని అధికారి వేడుకున్నాడు. కారు అతడి పేరు మీదే ఉంది. అతడొక మోసగాడు’ అని చెప్పారు.
News November 9, 2025
ఆముదం పంటలో దాసరి పురుగు నివారణ ఎలా?

దాసరి పురుగు ఆముదం పంటను జనవరి మాసం వరకు ఆశిస్తుంది. ఈ పురుగు పంటపై ఆశించిన తొలిదశలో ఆకులను గోకి తర్వాత రంధ్రాలు చేసి ఆకులన్నీ తింటాయి. పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లేత కొమ్మలను, కాడలను, పెరిగే కాయలను తిని పంటకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయి. దాసరి పురుగుల నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా థయోడికార్బ్ 1.5 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ కలిపి పంటపై పిచికారీ చేయాలి.


