News November 13, 2024

BREAKING: ప్రభుత్వం సంచలన నిర్ణయం

image

TG: డీఎస్సీ నియామకాలపై విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల ధ్రువపత్రాలను పున:పరిశీలించాలని నిర్ణయించింది. ఈ నెల 20, 21, 22 తేదీల్లో సర్టిఫికెట్లను రీవెరిఫికేషన్ చేయనుంది. నకిలీ ధ్రువపత్రాలు పెట్టి కొందరు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందినట్లు ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల <<14557915>>ఖమ్మంలోనూ <<>>ఏడుగురిని ఉద్యోగాల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.

Similar News

News November 25, 2025

అనంతపురం: దాడి కేసులో ఏడుగురి అరెస్ట్

image

అనంతపురం నగరం సాయి నగర్ 3rd క్రాస్‌లోని శ్రీనివాస మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌పై దాడిచేసి ధ్వంసం చేసిన ఘటనలో అడ్వకేట్ మొగలి సత్యనారాయణరెడ్డితోపాటు ఏడుగురుని అరెస్టు చేసినట్లు 2 టౌన్ సీఐ శ్రీకాంత్ తెలిపారు. నిందితులను 14 రోజుల రిమాండ్‌ నిమిత్తం జైలుకు తరలించామని పేర్కొన్నారు. దాడికి ఉపయోగించిన మూడు కార్లు, బైక్, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.

News November 25, 2025

నగదు విరాళాలపై కేంద్రం, ఈసీలకు సుప్రీం నోటీసులు

image

రాజకీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే రూ.2 వేల లోపు నగదు విరాళాలకు ఐటీ మినహాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. నగదు రూపంలో విరాళాలు తీసుకుంటే ఎన్నికల గుర్తు కేటాయించబోమని, పొలిటికల్ పార్టీగా నమోదు చేయబోమని షరతులు విధించేలా ఈసీకి ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై అభిప్రాయం చెప్పాలని కేంద్రం, ఈసీతోపాటు రాజకీయ పార్టీలకు సుప్రీం నోటీసులిచ్చింది.

News November 25, 2025

GAIL (INDIA) లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>GAIL<<>>(INDIA)లిమిటెడ్‌ 29 బ్యాక్‌లాగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి LLB, BE, B.Tech, ME, M.Tech, MCA, MBA, CA, CMA, B.Com, BA, BSc, MBBS, DGO, DCH ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.200, SC, ST, PWBDలకు ఫీజు లేదు. https://www.gailonline.com