News June 12, 2024

గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల

image

TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను TGPSC విడుదల చేసింది. జూన్ 9న ప్రిలిమ్స్ నిర్వహించగా, అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు HYDలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో పరీక్షలు ఉంటాయని తెలిపింది. అన్ని పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్షల షెడ్యూల్ పైనున్న ఫొటోల్లో చూడవచ్చు.

Similar News

News September 12, 2025

వరి, మొక్కజొన్నలో విత్తనశుద్ధి

image

☛ వరి: పొడి విత్తనశుద్ధిలో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండజిమ్ కలిపి 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. అదే దమ్ము చేసిన నారుమడికైతే లీటరు నీటికి 1 గ్రాము కార్బెండజిమ్ మందు కలిపిన ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి మండె కట్టి నారుమడిలో చల్లాలి. మొక్కజొన్న: కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ మందుతో విత్తనశుద్ధి చేయడం వల్ల మొదటి దశలో వచ్చే తెగుళ్ల నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకోవచ్చు.

News September 12, 2025

గర్భిణులు ఎలా పడుకోవాలంటే..

image

ప్రెగ్నెన్సీలో ఎడమ పక్కకి పడుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల కడుపులోని బిడ్డకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. వ్యర్థ పదార్థాలు కూడా మూత్రాశయాన్ని చేరుకోవడం సులభమవుతుంది. కాళ్లు, చేతుల వాపు తగ్గుతుంది. మూడో త్రైమాసికంలో సరైన నిద్ర కోసం దిండ్లను ఉపయోగించవచ్చు. దీంతో పాటు మెటర్నటీ బెల్ట్, నైట్ బ్రా కూడా మంచి నిద్రకు సహకరిస్తాయి. పడుకోవడానికి కనీసం గంట ముందే డిన్నర్ పూర్తి చేయాలి.

News September 12, 2025

ఆఫర్లున్నాయని అప్పులు చేసి కాస్ట్లీ ఫోన్లు కొంటున్నారా?

image

ఒక్కసారైనా ఐఫోన్ వాడాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఈ ఫోన్‌తో తమ స్టేటస్ మారిపోతుందని భ్రమపడుతుంటారు. ఇందుకోసం అప్పులు చేస్తుంటారు. ఇండియాలోని 4 ఐఫోన్లలో ఒకటి EMIలో కొనుగోలు చేసిందే. అయితే ఇంట్లో పరిస్థితులను అర్థం చేసుకోకుండా పేరెంట్స్‌ను ఇబ్బంది పెట్టి, అప్పులు చేసి కొనడం ఎంత వరకూ సమంజసం. ఫోన్ కంటే అదే EMIలో పేరెంట్స్‌కు బంగారం కొనడం బెస్ట్ అని పలువురు నిపుణులు చెబుతున్నారు.